నెక్స్ట్ ఆ మంత్రి మెజారిటీ పెరుగుతుందా?

M N Amaleswara rao
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ మంత్రి మెజారిటీ పెరుగుతుందా? ఆ మంత్రిగారి గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనా? ఇదీ.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌. ఇక్క‌డ నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మేక‌తోటి సుచ‌రిత‌.. 7 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. గ‌త 2009 ఎన్నిక‌ల్లో ఆమె ఇక్క‌డ నుంచి గెలిచినా.. అప్ప‌ట్లో మాత్రం కేవ‌లం 2 వేల కోట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో 2019కి వ‌చ్చేస‌రికి ఈ మెజారిటీ 5 వేల‌కు పెరిగింది.
దీంతో ఇప్పుడు .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మెజారిటీ డ‌బుల్ అవుతుందా ? అనే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కమైన రాజ‌కీయాలు ఇప్పుడు వైసీపీవైపే ఉన్నాయి. టీడీపీ ఇక్క‌డ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. మాకినేని పెద్ద‌ర‌త‌య్య పార్టీని న‌డిపిస్తున్నా.. ఇది ఎస్సీ నియోజ‌వ‌క‌ర్గం కావ‌డంతో.. ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసే ప‌రిస్థితి లేదు పోనీ.. ఇత‌ర నాయ‌కులు ఎవ‌రైనా.. దీటుగా పోటీ ఇచ్చే అవ‌కాశం ఉందా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.
దీంతో మేక‌తోటికి మెజారిటీ పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని ఇక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. అదేస‌మ‌యంలో నెల‌లో 5 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటున్నారు. ఇక‌, రాజ‌కీయంగా ఆమెను విమ‌ర్శిస్తున్న వారు కూడా క‌నిపించ‌డం లేదు. రాజ్య‌స‌భ సీటుపై దృష్టిపెట్టిన మాకినేని.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నా.. ఇక్క‌డ అనుకున్న విధంగా మంత్రిని టార్గెట్ చేయ‌డం లేదు. దీంతో ఇక్క‌డ నుంచి మ‌రోసారి సుచ‌రిత విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.
ప్ర‌జ‌ల‌తో ట‌చ్‌లో ఉండ‌డంతోపాటు.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కూడా ముందుకు తీసుకువెళ్తున్న నేప‌థ్యంలో మేక‌తోటికి మంచి మార్కులే ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. అయితే.. టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని ఖ‌రారు చేస్తే.. అప్పుడు ఏమైనా స‌మీక‌ర‌ణ‌లు మారే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే..మేక‌తోటి క‌నీసం 10 వేల మెజారిటీ మార్కును దాటేస్తార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: