న‌ర‌సాపురంలో గెలుపు ఎవ‌రిది.. టీడీపీ లెక్క‌లు ఎలా ఉన్నాయ్‌...!

VUYYURU SUBHASH
వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నాన‌ని స‌వాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ర‌ఘురామ ఉప ఎన్నిక‌ల‌కు వెళితే ఆయ‌న ఏ పార్టీ నుంచి బ‌రిలో ఉంటారు ? ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేస్తారా ?  లేదా జ‌న‌సేన నుంచి పోటీలో ఉంటారా ?  మ‌రి టీడీపీ ప‌రిస్థితి ఏంటి ?  వైసీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? అనే దానిపై ర‌క‌ర‌కాల లెక్క‌లు న‌డుస్తున్నాయి. అయితే టీడీపీ మాత్రం ఉప ఎన్నిక అంటూ జ‌రిగితే గెలుపు  త‌మ‌దే అన్న ధీమాతో ఉంది. ఆ పార్టీ ఇప్ప‌టికే రాబిన్ శ‌ర్మ టీం నేతృత్వంలో ఓ స‌ర్వే కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ స‌ర్వేలో న‌ర‌సాపురం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న 7 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల‌కొల్లులో త‌మ‌కు భారీ ఆధిక్యం వ‌స్తుంద‌ని టీడీపీ లెక్క‌లు వేసుకుంటోంది. ఇది టీడీపీ సిట్టింగ్ సీటు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ నుంచి పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడు ఏకంగా 18 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు  కూడా ఇక్క‌డ త‌మ‌కు భారీ ఆధిక్యం వ‌స్తుంద‌ని టీడీపీ ధీమాగా ఉంది. ఇక మంత్రి రంగ‌నాథ రాజు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఆచంట తో పాటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఉండి లోనూ.. అటు టీడీపీ కంచుకోట అయిన త‌ణుకులో కూడా టీడీపీ కి మంచి ఆధిక్యం వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇక తాడేప‌ల్లిగూడెం లో మాత్రం వైసీపీకి ఆధిక్యం ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక న‌ర‌సాపురంలో మాత్రం టీడీపీ మూడో ప్లేస్ లో ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన పోటీ జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య ఉండ‌వ‌చ్చ‌ని టీడీపీ వాళ్లే చెపుతున్నారు. అంటే ఇక్కడ తాము వీక్ గా ఉన్నామ‌ని టీడీపీ వాళ్లే చెపుతున్నారు. ఇక భీమ‌వ‌రంలో కూడా జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని.. న‌ర‌సాపురం, భీమ‌వ‌రం క‌వ‌ర్ చేసుకుంటే త‌మ‌దే గెలుపు అవుతుంద‌ని టీడీపీ ధీమాతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: