తెలంగాణలో కరోనా విలయం..500 మంది పోలీసులకు పాజిటివ్ ?

Veldandi Saikiran
చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అస్సలు వదలడం లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి... తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచ దేశాల్లోని ప్రజల పై... ముప్పేట దాడి చేస్తోంది ఈ మహమ్మారి వైరస్. దీంతో ఈ మహమ్మారి కారణంగా చాలా మంది అమాయకులు బలి అవుతున్నారు. ఇంకా ఇండియాలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి కేసులు... మళ్లీ ఒక ఇరవై రోజుల నుంచి ఓ రేంజ్ లో పెరుగుతూ వస్తున్నాయి. దీంతో భారత దేశంలోని ప్రజలంతా... అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకా ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో చైనీస్ వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి మనందరికీ విధితమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నటువంటి పోలీస్ శాఖ పై పంజా విసురుతోంది చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్. 

తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో  ఉన్న పోలీస్ సిబ్బంది కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడవ దశ లో 500 మంది కి కోవిడ్ పాజిటివ్..గా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.  మూడవ దశ లో ఇప్పటి వరకు 500 మంది పోలీస్ అధికారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.  కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులు  గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఇక కరోనా కేసులు పెరుగుతుండటం తో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే భయపడుతుంది సిబ్బంది. మూడు కమిషనరేట్ పరిధిలో అనేక కేసులు నమోదు అయినట్లు గా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు ఒక్క ఫిర్యాదు దారుడు తప్పా ఎవ్వరు రావొద్దని సూచనలు చేస్తున్నారు ఉన్నతాధికారులు.   ఇప్పటి వరకు పోలీసు శాఖ లో  90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గా నిర్ధారణ అయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. బుస్టర్ డోస్ ను సైతం వేగం పెంచాలని అధికారులకు అదేశాలు జారీ చేసింది సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: