అయ్య బాబోయ్.. స్మశానంలో కోడి పందాలు?

praveen
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. ఇక సంక్రాంతి పండక్కి జరిగే కోడిపందాలలో కోడిపుంజులను  బరిలోకి దింపేందుకు ఎన్నో రోజుల నుంచి సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక పండగ రాగానే ఇక ఈ కోళ్ళతో పందాలు నిర్వహించి భారీగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కోళ్ల పందాలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరం అంటూ అటు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. ఎవరైనా కోళ్ల పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాము అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.

 కానీ స్థానిక నాయకుల అండదండలతో ఎంతో మంది కోళ్ల పందాలు నిర్వహించడం మాత్రం చేస్తూనే ఉంటారు. ఇలా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఒక మంచి మైదానం లాంటి ప్రాంతాన్ని చూసుకుని ఇక అక్కడ కోళ్ల పందాలు నిర్వహించడం చేస్తే.. అక్కడికి భారీగా జనాలు తరలి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఓ వ్యక్తి కోడి పందాలు నిర్వహించాలి అనుకున్నాడు. దీంతో ఎక్కడ ప్లేసు దొరకనట్టు ఏకంగా స్మశానంలో కోడి పందాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు సదరు వ్యక్తి. ఇక స్మశానంలో కోడి పందాలు జరుగుతాయి అనుకుంటున్న సమయంలో ఊర్లో ఒక వ్యక్తి మృతి చెందాడు.

 దీంతో ఎంతో మంది స్మశాన వాటికకు వచ్చే అవకాశం ఉంది.. రహస్యంగా కోళ్ల పందాలు నిర్వహించాలి అనుకున్నా ఆ వ్యక్తికి షాక్ తగిలింది. దీంతో ఇక కోళ్ల పందేల వేదికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కొత్తపల్లిలో వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి మండలం కొమరగిరి లో స్థానిక నాయకుల అండదండలతో సంక్రాంతి పండక్కి కోడి పందాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కొంతమంది వ్యక్తులు. అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరూ ఊహించని విధంగా స్మశానం లో ఈ కోడిపందాలు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుండగా.. ఇక ఊర్లో ఒక వ్యక్తి మృతి చెందడంతో కోడిపందాల వేదికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఈ విషయం కాస్త ఊరంతా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: