పవన్ కలిసినా అవినాష్‌ని ఆపడం కష్టమేనా?

VUYYURU SUBHASH
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేతిలో కేవలం ఒక సీటు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 16 సీట్లకు 2 సీట్లు గెలుచుకున్నా సరే, తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాత్రమే టీడీపీలో మిగిలారు. గత ఎన్నికల్లో జగన్ గాలి ఎక్కువగా ఉన్నా సరే రామ్మోహన్, మంచి మెజారిటీతోనే ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే వంశీ వెళ్లిపోవడంతో కృష్ణా జిల్లాలో టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యేగా గద్దె మిగిలారు. ఇక గద్దెకు కూడా చెక్ పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం టీడీపీ నుంచి వచ్చిన దేవినేని అవినాష్‌కు తూర్పు బాధ్యతలు అప్పగించారు. మామూలుగానే తూర్పు నియోజకవర్గం అవినాష్...సొంత స్థానం. ఇక్కడ అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఇప్పుడు అవినాష్‌కు వచ్చింది.
తూర్పులో అవినాష్ జోరు కొనసాగుతుంది. రెండేళ్లలోనే అవినాష్ తూర్పుపై పట్టు సాధించారు. పైగా అధికార పార్టీలో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు కావల్సిన పనులు చేసి పెడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఆఫీసు చూసుకున్న సరే పెద్దగా జనం కనిపించకపోవచ్చు. కానీ ఒక్క అవినాష్ ఆఫీసులో మాత్రం  నిత్యం జనం కనిపిస్తూనే ఉంటారు. ప్రజల కోసం గుణదలలో ప్రత్యేకంగా ఆఫీసు పెట్టేశారు. సమస్యలు ఉన్న ప్రజలు నేరుగా గుణదల ఆఫీసుకు వెళ్లిపోతారు.
అక్కడ ప్రభుత్వ ఆఫీసు మాదిరిగానే, సమస్యలు వినడానికి పలు విభాగాలు ఉన్నాయి. అలాగే ఆ సమస్యలని వెంటనే పరిష్కారం అయ్యేలా అవినాష్ చూసుకుంటారు. అందుకే తూర్పులో అవినాష్‌కు తిరుగులేని ప్రజా బలం పెరిగింది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ తూర్పులో ఈయన గెలుపు కష్టమే అని చెప్పొచ్చు. ఒకవేళ టీడీపీతో పవన్ కల్యాణ్ జట్టు కట్టినా అవినాష్‌కు చెక్ పెట్టడం ఈజీ కాదని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: