ఎర్రబెల్లి-తలసానిలకు బ్రేకులు వేయడం కష్టమేనా?

M N Amaleswara rao
ఎర్రబెల్లి దయాకర్ రావు...తలసాని శ్రీనివాస్ యాదవ్‌..ఈ రెండు పేర్లు...ఒకప్పుడు, ఇప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తూ వస్తున్నాయని చెప్పొచ్చు. గతంలో చంద్రబాబు సన్నిహితులుగా...ఇప్పుడు కేసీఆర్ సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు. అసలు ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు తెలంగాణలో బలమైన నేతలుగా ఉన్నారు. అసలు వీరి ఇద్దరి రాజకీయం టీడీపీలోనే మొదలైన విషయం తెలిసిందే.
ఇక ఇద్దరి తొలి విజయాలు 1994 ఎన్నికల్లోనే దక్కాయి...ఎర్రబెల్లి, వర్ధన్నపేట నుంచి..తలసాని, సికింద్రాబాద్ నుంచి గెలిచారు. అయితే ఎర్రబెల్లి విజయాలకు ఎక్కడా బ్రేక్ పడలేదు. ఆయన వరుసపెట్టి వర్ధన్నపేట నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలిచేశారు. అయితే 2009 ఎన్నికలోచ్చేసరికి పాలకుర్తి బరిలో నిలబడ్డారు...2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి నిలబడి పాలకుర్తిలో గెలిచారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలు, తెలంగాణలో టీడీపీ వీక్ అయిపోవడంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
2018 ఎన్నికలోచ్చేసరికి తొలిసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో పాలకుర్తిలో గెలిచారు. ఇప్పుడు ఆయన మంత్రిగా దూసుకెళుతున్నారు. అసలు ఆయనకు పాలకుర్తిలో ఎదురే లేదనే పరిస్తితి. అక్కడ కాంగ్రెస్ గాని, బీజేపీ గాని వీక్‌గా ఉన్నాయి. ఏ మాత్రం రెండు పార్టీలకు బలం లేదు. ఈ పరిస్తితి చూస్తే పాలకుర్తిలో మళ్ళీ ఎర్రబెల్లి విజయం ఆపడం కష్టమే అని చెప్పొచ్చు.
తలసాని విషయానికొస్తే 1994లో గెలిచిన తలసాని, 1999 ఎన్నికల్లో మళ్ళీ సికింద్రాబాద్ నుంచి గెలిచారు. ఇక 2004లో ఓడిపోయిన ఆయన, 2008 ఉపఎన్నికలో గెలిచారు. అలాగే 2009 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోయారు. అయితే 2014లో సికింద్రాబాద్ వదిలి సనత్‌నగర్ బరిలో నిలిచి టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వదిలేసిన విషయం తెలిసిందే. అలాగే కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి మరొకసారి మంత్రి పదవి కొట్టేశారు. ఇలా మంత్రిగా ఉన్న తలసాని సనత్‌నగర్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ తలసానికి చెక్ పెట్టడం ప్రతిపక్షాలకు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: