అదిరిపోయే ట్విస్ట్: అక్కడ వైసీపీ-టీడీపీలకు జనసేన చెక్?

M N Amaleswara rao
అదేంటి వైసీపీ-టీడీపీలకు జనసేన చెక్ పెట్టేంత సీన్ ఉందా? అసలు జనసేనకు అనుకూలంగా ఉన్న ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ వైసీపీ-టీడీపీల పరిస్తితి బాగోలేదా? అంటే కాస్త అవును...కాస్త కాదు అని చెప్పొచ్చు. అసలు వైసీపీ-టీడీపీలకు జనసేన చెక్ పెట్టే స్టామినా ఉన్న నియోజకవర్గం వచ్చి...తాడేపల్లిగూడెం. ఈ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొదట నుంచి టీడీపీకి కాస్త అనుకూలంగా ఉండేది.
1999 వరకు గూడెంలో టీడీపీ హవా నడిచింది...కానీ 2004 నుంచి సీన్ మారింది...అయితే కాపులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం విజయం సాధించింది. ఇక 2014లో టీడీపీ-బీజేపీలకు పవన్ మద్ధతు ఇవ్వడంతో, బీజేపీ నుంచి పోటీ చేసిన పైడికొండల మాణిక్యలరావు గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ-జనసేనలు విడివిడిగా పోటీ చేయడం వైసీపీకి బాగా కలిసొచ్చింది..అనూహ్యంగా వైసీపీ విజయం సాధించింది.
అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పరిస్తితి అంత మెరుగ్గా లేదు...ఈయన పశ్చిమ గోదావరిలోనే ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యీల లిస్ట్‌లో ఉన్నారు. ఈయన పనితీరు పట్ల గూడెం ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మళ్ళీ ఈయనకు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ పరిస్తితి కూడా మెరుగు అవ్వలేదు...టీడీపీ నేతలు ఈలి నాని, ముళ్ళపూడి బాపిరాజులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటు ఇంచార్జ్ వలవల బాబ్జీ ఎఫెక్టివ్‌గా పనిచేయలేకపోతున్నారు.
ఇదే సమయంలో ఇక్కడ జనసేన ఇంచార్జ్‌గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ దూకుడుగా పనిచేస్తున్నారు..గత ఎన్నికల్లో ఈయనకు 36 వేల ఓట్లు వరకు వచ్చాయి...ఈ సారి మాత్రం సత్తా చాటాలని చూస్తున్నారు..ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే దక్కేలా ఉంది...అప్పుడు సునాయసంగా జనసేన పార్టీ గెలవడం ఖాయమనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: