పొత్తులో ట్విస్ట్‌లు: భీమవరం సీటు ఫిక్స్ చేయొచ్చు?

M N Amaleswara rao
టీడీపీ-జనసేన పార్టీల పొత్తుల విషయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి...అసలు రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందో లేదో క్లారిటీ మాత్రం రావడం లేదు..ఓ వైపు ఏమో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు రెడీగానే ఉన్నారు..అటు పవన్ మాత్రం ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడవద్దని అంటున్నారు. మధ్యలో జనసేన కార్యకర్తలు ఏమో పవన్‌కు సీఎం సీటు ఇస్తే పొత్తుకు రెడీ అని టీడీపీకి సూచిస్తున్నారు. అయితే సీఎం సీటు ఏమో గానీ...పొత్తు విషయంలో మాత్రం ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.
కాకపోతే పొత్తు పెట్టుకోవాలని టీడీపీ అధిష్టానం మాత్రం గట్టిగానే అనుకుంటుంది...ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకపోవడం వల్లే చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఈ సారి కూడా పొత్తు లేకపోతే టీడీపీ మళ్ళీ ఓడిపోవడం, వైసీపీ మళ్ళీ గెలవడం జరిగిపోతాయని చంద్రబాబుకు కాస్త భయం పట్టుకుందనే చెప్పొచ్చు. అందుకే పవన్‌ని కలుపుకోవడానికి బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
అసలు పొత్తుపై నమ్మకంతోనే కొన్ని సీట్లలో టీడీపీని డమ్మీ చేశారు..జనసేనకు ఆ సీట్లు ఇవ్వడానికి బాబు ముందే ప్రిపేర్ అయ్యారు. అలాంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలని ఇంచార్జ్‌లుగా పెట్టలేదు. ఉదాహరణకు భీమవరం సీటు చూసుకుంటే...ఇక్కడ టీడీపీ సీనియర్ నేత పులపర్తి అంజిబాబుని సైడ్ చేసి...మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మీని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే ఇంతవరకు ఆమె రాజ్యసభ ఎంపీగా పనిచేశారు గాని...డైరక్ట్‌గా ఎన్నికల బరిలో దిగడం పెద్దగా జరగలేదు.
అలాంటప్పుడు ఆమెకు భీమవరం బాధ్యతలు ఇవ్వడానికి కారణం...మళ్ళీ ఆ సీటు జనసేనకు ఇస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికే..ఒకవేళ పొత్తు ఉంటే ఖచ్చితంగా భీమవరం సీటు జనసేనకు ఇవ్వాల్సిందే. పవన్ పోటీ చేసిన చేయకపోయిన...ఆ సీటు జనసేనకే. ఆ విషయం బాబుకు ముందే తెలుసు. అందుకే అక్కడ టీడీపీని డమ్మీ చేశారు. ఇప్పుడు పొత్తులు తేలేలా లేవు. మరి అలాంటప్పుడు అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్ధిని పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: