ఓరి నాయనో.. చైనాలో కొత్త రోగం?

praveen
చేసిన పాపానికి ఎన్నటికైనా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇక ఇప్పుడు అటు చైనా విషయంలో ఇది నిజం అవుతుంది అన్నది అర్ధమవుతుంది. ప్రపంచ వినాశనానికి కరోనా వైరస్ అనే ఒక ప్రాణాంతకమైన వైరస్ ను పుట్టించింది చైనా. ఈ వైరస్ కారణంగా ఎన్నో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ అసలు నిజాలు దాచి పెట్టి ప్రపంచ దేశాలలో అల్లకల్లోల పరిస్థితులు రావడానికి కారణం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకిపోయి కోట్ల మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక రూపాంతరం చెందుతూ ఇప్పటికీ ప్రపంచదేశాలను పట్టి పీడిస్తూనే ఉంది.

 అయితే చైనా పుట్టించిన కరోనా వైరస్ ఇక ఇప్పుడు చైనా కి ముచ్చెమటలు పట్టిస్తోంది అన్నది అర్ధమవుతుంది. ఇటీవలి కాలంలో చైనా లో విపరీతంగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయ్. దీంతో అక్కడ ఎన్నో ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలందరినీ కూడా ఇంటికే పరిమితం అయ్యే విధంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తుంది చైనా ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ ను సమర్ధవంతంగా కట్టడి చేస్తున్నాము అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా సమయంలో ఇక ఇప్పుడు చైనాలో మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది.

 చైనాలో బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య పెరిగి పోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో భారత్లో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చైనా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇక ఇటీవలే బర్డ్ ఫ్లూ బారినపడి ఏకంగా ఐదు మంది వరుసగా ప్రాణాలు కోల్పోవడం కూడా సంచలనం గానే మారిపోయింది. కొంతమంది బర్డ్ ఫ్లూ సోకిన కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతే.. మరికొంతమంది మాత్రం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడిపోతున్న చైనాకు ఇక ఇప్పుడు బర్డ్ ఫ్లూ లాంటి సవాలు కూడా ఎదురుకావడంతో చైనా ప్రభుత్వం తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: