కన్నీళ్ళకు కరగని తాలిబన్లు.. ఏం చేశారో చూడండి?

praveen
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ పాలన సాగిస్తున్న తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది. తాలిబన్ల ప్రభుత్వం  కారణంగా ఎక్కడ ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక అదే సమయంలో కనీసం తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆప్ఘనిస్థాన్లో ప్రజలు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన సాగిస్తాము అంటూ చెప్పిన తాలిబన్లు మాత్రం ఎప్పుడు ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్న పట్టించుకోవడం లేదు. కేవలం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడం తమ పైశాచికత్వాన్ని తీర్చుకోవడం లాంటివి చేస్తున్నారు.

 అయితే ఇస్లామిక్ చట్టాల ప్రకారం సినిమాలను అనుమతించబోమని చెబుతూ సినిమాలపై పూర్తి నిషేధం విధించారు. అంతేకాకుండా ఇక ఆఫ్ఘనిస్తాన్లో సంగీతంపై కూడా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ఎంత అరాచకాలను కొనసాగిస్తున్నారు అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఇటీవల ఏకంగా నడిరోడ్డుపై సంగీత వాయిద్యాలను ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు పెట్రోల్ పోసి తగలబెట్టిన ఒక వీడియో  చక్కర్లు కొడుతుంది. అయితే ప్రాణం కంటే ఎక్కువ అయినా సంగీత వాయిద్యాలను తాలిబన్లు తగల పెడుతూ ఉంటే వద్దు అని సంగీత విద్వాంసుడు కన్నీళ్లు పెట్టుకుంటున్న తాలిబన్ల  మనసు మాత్రం కలగలేదు.

 ఇక సంగీత విద్వాంసుడు కనీసం నిలబడిన చోటు నుంచి ఎక్కడికి కదలకుండా ఉండేందుకు అతనికి తుపాకీని ఎక్కుపెట్టి మరి తాలిబన్లు సంగీత వాయిద్యాలను కాల్చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతూ హేళనగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో కనిపిస్తోంది.. ఈ వీడియోని ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన జర్నలిస్టు అబ్దుల్ హాక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.. ఆఫ్ఘనిస్తాన్లో సంగీతం ఎక్కడ వినిపించ కూడదు అంటూ తాలిబన్లు నిషేధాజ్ఞలు విధించారు అనే విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన అటు తాలిబన్ల అరాచకాలకు నిలువుటద్దంగా మారిపోతుంది అన్నది అర్థం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: