వైసీపీలో ఆ ఇద్ద‌రు ఎంపీల‌కు హ్యాట్రిక్ ఛాన్స్..?

VUYYURU SUBHASH
రాష్ట్రంలో టీడీపీకి ఎంత బలం ఉందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో కొంచెం గట్టిగానే దెబ్బతిన్నా సరే..ఇప్పుడుప్పుడే పార్టీ పికప్ అవుతుంది. చాలా చోట్ల వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. అయితే ఎప్పుడు ఎలాంటి పరిస్తితి ఉన్నా సరే కొన్ని చోట్ల టీడీపీకి ఏ మాత్రం బలం ఉండదు...అలాంటి స్థానాలని అసలు టీడీపీ లెక్కల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు. అలా చాలా సీట్లని టీడీపీ లెక్కలో నుంచి తీసేయొచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే...టీడీపీ గట్టిగా 20 స్థానాలనే లెక్కలో తీసుకోవాలని చెప్పొచ్చు. మిగిలిన స్థానాల్లో ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే టీడీపీ గెలవడం గగనం.
అంటే టీడీపీ కేవలం 20 ఎంపీ స్థానాలనే కౌంట్‌లోకి తీసుకోవాలి. అలా టీడీపీ కౌంట్‌లో లేనివి కడప, రాజంపేట ఎంపీ స్థానాలు. ఈ రెండు చోట్ల టీడీపీ గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయాయని చెప్పొచ్చు. ఇక మళ్ళీ ఈ రెండు చోట్ల గెలుస్తుందనే నమ్మకం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఈ రెండు స్థానాలు టీడీపీకి ఏ మాత్రం కలిసిరావు. వైఎస్సార్ ఫ్యామిలీ ప్రభావంతో ఈ రెండు స్థానాలు మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి.
గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీదే గెలుపు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలవగా, కడప నుంచి అవినాష్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇక మూడోసారి గెలవడం కూడా వారికి పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా ఈ రెండుచోట్ల టీడీపీకి నాయకులు లేరు. ఉండటానికి ఇద్దరు పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో వారు బరిలో దిగుతారా? లేక వేరే నేతలు ఏమన్నా బరిలో దిగుతారా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ టీడీపీ నుంచి ఎవరు బరిలో దిగిన మిథున్, అవినాష్‌ల హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు వేయడం కష్టమనే చెప్పొచ్చు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: