మన నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్‌ పీఎం ఐతే..?

Chakravarthi Kalyan
ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌ త్వరలో బ్రిటన్ ప్రధాని కావచ్చని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ ప్రస్తుత ప్రధానమంత్రి బోరిస్‌ దిగిపోవాలన్న ఆందోళన రోజురోజుకూ ఎక్కువవుతోంది. కరోనా సమయంలో ప్రధానిగా ఉండి నిర్లక్ష్యంగా మందు పార్టీ ఏర్పాటు చేశాడన్నది బోరిస్‌పై వచ్చిన ఆరోపణ.. ఇదొక్కటే కాదు.. కరోనా సమయంలో సరిగ్గా నియంత్రణ చర్యలు తీసుకోలేదన్న అసంతృప్తి కూడా ఉంది. సొంత పార్టీ నుంచే ఈ వాదన బలంగా వస్తుండటంతో ఆయన దిగిపోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి.

మరి అదే నిజమైతే.. బ్రిటన్‌ ప్రధానిగా ఎవరవుతారు.. ఈ ప్రశ్నకు ముందుగా వినిపిస్తున్న పేరు మన నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌దే. భారత సంతతికి చెందిన ఈ రిషి సునక్ పేరు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి స్వయానా అల్లుడు. ఈ రిషి ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. ఒకవేళ బోరిస్‌ తప్పుకొంటే ప్రధాని రేసులో రిషి సునక్‌కు అత్యధిక మంది మద్దతు ఇస్తారని బెట్‌ ఫెయిల్ అనే సంస్థ సర్వే కూడా చెబుతోంది.

అదే జరిగితే బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునక్ చరిత్ర సృష్టిస్తారు. అది సరే.. మరి బ్రిటన్ ప్రధానిగా మనోడు ఎన్నికైతే.. ఇండియాకు ఏం ఒరుగుతుంది.. ఈ పరిణామం ఇండియాకు ఎలా లాభిస్తుంది.. ఇండియా- బ్రిటన్ సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది.. అనే అంశాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇండియాను బ్రిటన్‌ వందల ఏళ్లపాటు పాలించిన సంగతి తెలిసిందే. ఇండియాలో బ్రిటిష్ వారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. జలియన్ వాలాబాగ్‌లో వందల మందిని కాల్చి చంపినటువంటి దారుణాలు ఎన్నో జరిగాయి. ఇప్పటి వరకూ అలాంటి వాటికి బ్రిటన్ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు.

ఇండియా నుంచి బ్రిటిష్‌ వారు దోచుకెళ్లిన సంపద ఎంతో ఉంది. కోహినూర్‌ వజ్రంతో పాటు అనేక అపూరూప కళాఖండాలు ఇంకా బ్రిటన్ వద్దే ఉన్నాయి. మరి మన రిషి సునక్‌ బ్రిటిష్ ప్రధాని అయితే.. ఇలాంటివి ఇండియాకు తిరిగి వస్తాయా.. చూడాలి ఏం జరుగుతుందో.. అదే జరిగితే అద్భుతమే. అలాంటి అద్భుతాలు జరగాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: