చైనాలో కఠిన ఆంక్షలు.. లాక్ డౌన్ షురూ..!

MOHAN BABU
చైనాలో కరోనా ను సమూలంగా నిర్మించేందుకు ఆ దేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ ఆంక్షలు అమలు చేయడంలో  విఫలమయ్యారని ముగ్గురు అధికారులను జైలుకు పంపించారు. చైనా ను జీరో కరోనా గా మార్చేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు  అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే చైనాలోని మూడు పెద్ద నగరాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. చైనా ప్రభుత్వం కరోనా ను అంతం చేసేందుకు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. చిన్న తప్పిదాలకు కూడా పెద్ద శిక్షలు విధిస్తున్నారు. ఓ సంస్థలో మాస్కు పెట్టుకోక పోవడాన్ని నేరంగా  పరిగణించి ముగ్గురు అధికారులకు జైలు శిక్ష విధించారు.

సంస్థలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయడంలో అధికారులు విఫలమైనందున వారికి నాలుగేళ్లకు పైగా శిక్ష వేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో  ఒక్క కేసు కూడా ఉండకూడదు అనే లక్ష్యంతో జియాంగ్, యోంగ్చు నగరాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుంది. లాక్ డౌన్ కారణంగా  ఆహార కొరత తో ఇబ్బందులు పడుతున్నట్టు అక్కడి జనం ఆరోపణలు చేస్తున్నారు. అయినా వాటిని పట్టించుకోకుండా చైనా కఠినమైన లాక్ డౌన్ ను కొనసాగిస్తోంది.జీరో వైరస్ కంట్రీగా మార్చేందుకు ఆంక్షలను అమలు చేస్తోంది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోతే కఠినంగా శిక్షిస్తోంది. బీజింగ్ లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న డాలియన్ ఓడరేవుకు చెందిన కార్గో సంస్థ లో పనిచేస్తున్న సిబ్బంది మాస్కులు ధరించలేదు. మాస్కులు వేసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగారు. దాంతో 83 మందికి వైరస్ సోకింది.

దీనిపై విచారించిన అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించకపోవడాన్ని సంస్థ పట్టించుకోలేదని పేర్కొని ఆ సంస్థ పై భారీ జరిమానా విధించారు. అంతేకాదు సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధులకు 39 నుంచి 57 నెలల వరకు జైలు శిక్ష వేశారు. చైనా లోని మరో నగరంలోనూ వైరస్ కేసులు వెలుగుచూడ్డంతో స్థానిక ప్రభుత్వం అక్కడ కూడా లాక్ డౌన్ విధించింది. 55 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చైనాలో రెండు కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: