లక్నో : బీజేపీ దెబ్బకొట్టేందుకు అఖిలేష్ ఎంత మాస్టర్ ప్లాన్ వేశారో తెలుసా ?

Vijaya


అధికార బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు యూపీలో బీజేపీదే పైచేయిగా ఉంది. ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలైందో అప్పటి నుండో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ప్రతిరోజు బీజేపీ అగ్రనేతలకు టెన్షన్ పెరిగిపోతోంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుండి ప్రతిరోజు ఒకమంత్రి లేదా కొందరు ఎంఎల్ఏలు వరసబెట్టి బీజేపీకి రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు.



గడచిన వారం రోజుల్లో సుమారు మంత్రులు, ఎంఎల్ఏలు కలిపి పదిమంది బయటకు వచ్చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారంతా నేరుగా ఎస్పీలోనే చేరిపోతున్నారు. అందరికీ పైకి కనిపిస్తున్నది ఇది మాత్రమే. కానీ లోలోపల అఖిలేష్ బ్రహ్మాండమైన స్కెచ్ వేశారు. మంత్రులు, ఎంఎల్ఏలు బయటకు వచ్చేయటానికి అవసరమైన ప్లన్ దాదాపు రెండు నెలల క్రితమే వేశారట. ఎస్పీలోకి చేరాలని అనుకున్న బీజేపీ మంత్రలు, ఎంఎల్ఏలతో అఖిలేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారట.



ఇప్పటివరకు బీజేపీకి రాజీనామా చేసిన వారిలో అత్యధికులు బీసీ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. బీసీలను కమలంపార్టీ చిన్నచూపు చూస్తోందని ఎస్టాబ్లిష్ చేయటమే అఖిలేష్ ప్లానుగా ఉంది. పైగా వచ్చే వాళ్ళందరు ఒకేసారి రాకుండా రోజుకొకరు, రెండు రోజులకు ఇద్దరు చొప్పున వచ్చేట్లు ప్లాన్ చేశారు. ఎందుకంటే రాదలచుకున్న వారందరు ఒకేసారి వచ్చేస్తే అది ఒకటి రెండు రోజుల వార్తగా మిగిలిపోతోంది. అదే 10-15 రోజులపాటు వరుసగా వచ్చేస్తుంటే ప్రతిరోజు ఆ విషయం వార్తల్లో నిలుస్తుంది.



పైగా రాజీనామాల అంశం బీజేపీకి మైనస్ గాను, ఎస్పీకి ప్లస్ గాను మీడియాలో ప్రముఖంగా వస్తోంది.  న్యూట్రల్ జనాల్లో ఇదే విషయం బాగా చర్చల్లో నలుగుతోంది. ఇదే సమయంలో తమ పార్టీలో నుండి ఏరోజు ఎవరు వెళ్ళిపోతారో తెలీక బీజేపీ అగ్రనేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళపై నిఘావేసి అనుమానంతో చూస్తున్నారు. నిజానికి బీజేపీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వలసలను పసిగట్టడంలో ఫెయిలయ్యాయి.  మొత్తానికి బీజేపీని దెబ్బ కొట్టడానికి అఖిలేష్ పెద్ద మాస్టర్ ప్లానే వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: