సిక్కోలు తమ్ముళ్ళు మామూలుగా లేరుగా!

M N Amaleswara rao
ఏపీలో ఎన్నికలై రెండున్నర ఏళ్ళు దాటేశాయి....అయితే ఇంతకాలం ప్రతిపక్ష టీడీపీ నేతలు కాస్త నిదానంగా ఉంటూ వచ్చారు. వైసీపీపై దూకుడుగా వెళితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని చెప్పి కొందరు టీడీపీ నేతలు సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల చంద్రబాబు, టీడీపీ నేతలకు పెద్ద వార్నింగ్ ఇచ్చారు...సరిగ్గా పనిచేయకపోతే ఎంతటివారినైనా పక్కన పెట్టేస్తానని అన్నారు. దీంతో తమ్ముళ్ళు పనిచేయడం స్టార్ట్ చేశారు...కాకపోతే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉంది.


అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా పనిచేస్తున్నారు. జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఎలాగో రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. టెక్కలిలో అచ్చెన్నాయుడు, ఇచ్చాపురంలో అశోక్‌లు ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే తన సొంత నియోజకవర్గం టెక్కలిలో టీడీపీ బలం ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు.
అటు ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు పోటీగా ఆయన బామ్మర్ది, టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ బ్రాండ్ నాయకుడు మాదిరిగా పనిచేస్తున్నారు. ఈయన శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అటు పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు ధీటుగా టీడీపీ నాయకురాలు గౌతు శిరీష పనిచేస్తున్నారు.
అలాగే పాతపట్నంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈయన వైసీపీపై పైచేయి సాధించారని చెప్పొచ్చు. శ్రీకాకుళం అసెంబ్లీలో గుండా లక్ష్మీ, నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి, రాజాంలో కొండ్రు మురళీమోహన్, పాలకొండలో నిమ్మక జయకృష్ణలు యాక్టివ్‌గా ఉన్నారు. ఇలా శ్రీకాకుళం జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే సిక్కోలు తమ్ముళ్ళు బెటర్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: