మెగాస్టార్ పై రోజా కూల్ కామెంట్స్ .. వామ్మో ఏం మార్పో!

RATNA KISHORE
సినీ ఇండ‌స్ట్రీకి మంచి చేసే ప‌నుల్లో రారాజు అయిన మెగాస్టార్ ఉంటారు. ఆయ‌న‌కు అండ‌గా చాలా మంది ఉంటారు.ఇండ‌స్ట్రీకి మంచి జ‌రిగితే త‌న‌కూ మంచే జ‌రిగిన విధంగా భావిస్తారు రోజా.అందుక‌నో ఎందుక‌నో ఈ సారి మాత్రం భేటీ విష‌యాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల‌నే స‌మ‌స్య జ‌ఠిలం అవుతుంద‌ని

ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.అలా కాకుండా ఎవ‌రి బాధ‌లు వారు చెప్పుకుంటే స‌మస్య‌లు సులువుగా ప‌రిష్కారం అవుతాయ‌నే చెప్పారు.అందుకు అనేక సంద‌ర్భాలు సాయం అవుతాయ‌ని నిన్న‌టి సంద‌ర్భం కూడా ఇండ‌స్ట్రీకి మంచి చేసేందుకే కార‌ణం అవుతుంద‌ని అర్థం వ‌చ్చే విధంగా మాట్లాడారు రోజా.అంటే త్వ‌ర‌లోనే ఓ సానుకూల నిర్ణ‌యం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని రోజా కూడా ఆశాభావంతో ఉన్నార‌ని, అందుకు ఆ ఇద్ద‌రూ (చిరు,జ‌గ‌న్‌) రూట్ క్లియ‌ర్ చేశార‌నేగా అనుకోవాలి.

పండ‌గ పూట రాజ‌కీయాలు ఎందుకులే కానీ రోజా మాత్రం ఈ సారి చాలా హుందాగానే ఉన్నారు.అంటే ఆమె స‌హ‌జ‌శైలికి భిన్నంగా ఉన్నారు. క‌డ‌ప జిల్లా శెట్టిపాలెంలో సంక్రాంతి వేడుక‌ల్లో ఉన్నారు.ఆనందంగా ఉన్నారు.ముఖ్యంగా ఎప్పుడూ లేనంత సంతోషంతో ఉన్నారు.అందుక‌నో/ఎందుక‌నో రాజ‌కీయాల‌కు అతీతంగా నాలుగు మాట‌లు చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌కుండానే ఉన్నారు.కానీ రాజ‌కీయం మాట్లాడినా కొంత సంయ‌మ‌నంతో మాట్లాడి ఇండ‌స్ట్రీ మ‌న‌సు గెలుచుకున్నారు.ఎప్ప‌టిలానే జ‌గ‌న‌న్న‌కు మాత్రం మ‌ద్ద‌తుగా నిలిచి చిరుకు కూడా త‌న‌దైన సంఘీభావం తెల‌ప‌డం ఈ మాట‌ల్లో కూడుకున్న విశేషం. దాగి ఉన్న విశేషం కూడా ఇదే!
ఎప్పుడూ హాట్ హాట్ కామెంట్ల‌తో గుంటూరు కారంలా వెర్రెత్తించే రోజారెడ్డి ఎట్ట‌కేల‌కు పండుగ వేళ కూల్ కామెంట్స్ చేశారు.చిరు,జ‌గ‌న్ భేటీకి సంబంధించి సానుకూల దృక్ప‌థంతో మాట్లాడారు.ఇండ‌స్ట్రీ మంచికే జ‌గ‌న్ ఉన్నార‌ని,ఆయ‌న‌కున్న బిజీ షెడ్యూల్ లో ఇండ‌స్ట్రీ గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు అని,అయినా అన్ని వ‌ర్గాల క్షేమం కోసం చిరు తో జ‌గ‌న్ భేటీ అయ్యారు అని వివ‌రించారు. చిరు చెప్పిన ప్ర‌తిపాద‌న‌లు సమంజసంగా ఉంటే ఇండ‌స్ట్రీకి త‌ప్పనిసరిగా మంచే జ‌రుగుతుంద‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: