ఆన్ లైన్ లో కోళ్ల పందాలు.. ఎలాగో తెలుసా?

praveen
తెలుగు ప్రజలందరికీ ఎంతో ప్రీతికరమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊరువాడ పండుగ శోభ సంతరించుకుంటుంది. ఎక్కడ చూసినా రంగురంగుల రంగవల్లులు ఇంటి ముందు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు  ఇక సాంప్రదాయ వస్త్రధారణలో తెలుగు అమ్మాయిలు. ఇంకేముంది ఇక ఊరు వాడ మొత్తం డీజే పాటలతో దద్దరిల్లిపోతోంది. చిన్నా పెద్దా తేడా లేదు అందరూ కూడా గాలిపటాలు ఎగురవేస్తూ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇక సంక్రాంతి పండుగ అంటే కేవలం ఇవి మాత్రమే కాదు అందరికీ గుర్తొచ్చేది కోళ్ల పందాలు. తెలంగాణలో కోళ్ల పందాలు దాదాపు జరగవు. కానీ ఆంధ్ర లో మాత్రం కోళ్ల పందాలు లేకుండా సంక్రాంతి పండుగ జరగదు అని చెప్పాలి. అయితే కోళ్ల పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ జనాలు ఊరుకుంటారా ఏదో ఒక విధంగా కోళ్ల పందాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.

 అందుకే తెలంగాణ నుంచి ఎంతోమంది సంక్రాంతికి ఏపీ వెళ్లి అక్కడ కోళ్ల పందాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కోళ్ల పందాల లో ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారన్నది ఎప్పుడూ వినిపించే మాట. ఇక ఈసారి కూడా సంక్రాంతి వచ్చేసింది. కోళ్ళ పందేలకు అంతా సిద్ధమైపోయింది. కోళ్ల పందాలు జరగకుండా చూసేందుకు పోలీసులు చర్యలు చేపడుతుంటే ఎలాగోలా పోలీసులకు తెలియకుండా కోళ్ల పందాల నిర్వహించేందుకు అందరూ సిద్ధమైపోయారు. ఇక ఈసారి కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాల లో కాస్త టెక్నాలజీని జోడిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఇటీవల ఏకంగా సంక్రాంతికి గంగిరెద్దులు తీసుకువచ్చే హరిదాసు ఏకంగా  గంగిరెద్దుకు ఒక క్యూఆర్ కోడ్ పెట్టడం ఇటీవలే చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు కోళ్ల పందాలలో కూడా ఇలాంటి టెక్నాలజీ జోడిస్తున్నారట. ఎక్కడినుంచైనా కోళ్ల పందాలను చూసేందుకు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారట. అంతేకాదండోయ్ నేరుగా వెళ్లి బెట్టింగులు వేయాల్సిన అవసరం లేదు. కోళ్ల పందాలు పై ఆన్లైన్లోనే బెట్టింగులు వేసేందుకు కొన్ని వెబ్ సైట్స్ కూడా రూపొందించుకున్నారట. ఇక కోళ్ల పందాల పై ఆసక్తి ఉన్న వాళ్ళని వాట్సాప్ గ్రూపు లో చేర్చి కోళ్ల అమ్మకాలు కొనుగోలు లాంటివి కూడా చేయడం మొదలు పెట్టారట. ఇలా కోళ్ల పందాలు కూడా ఆన్లైన్ యుగంలోకి మారిపోయాయి అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: