వ్యాక్సిన్ అద్భుతం.. లేచి నిలబడ్డాడు?

praveen
వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చనిపోతాడు అనుకున్న వ్యక్తి బ్రతికి బట్ట కట్టడం. ఇక మంచానికి పరిమితం అయ్యాడు అనుకున్న వ్యక్తి అనుకోని విధంగా లేచి కూర్చోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు అన్ని తెలిసిన వైద్యులు సైతం ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇటీవలికాలంలో  ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఇలాంటి ఒక మిరాకిల్ జరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది అని అటు వైద్యులు సైతం అవాక్కవుతున్న పరిస్థితి ఏర్పడింది.

 ఇంతకీ ఏమైంది అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు ఇక భారత్ లో ఎక్కువగా కోవిషీల్డ్ టీకా వాడుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇక కోవిషీల్డ్  వైరస్ కు చెక్ పెట్టేందుకు ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతుండడం గమనార్హం. కానీ ఇక్కడ మాత్రం కోవిషీల్డ్ అద్భుతమే సృష్టించింది దాదాపు ఐదేళ్ల నుంచి మంచానికే పరిమితమైన ఒక వ్యక్తిని లేచి నిలబడేలా చేసింది. మాటలు పడిపోయి కేవలం సైగలతో జీవనం సాగిస్తున్న వ్యక్తికి మాటలు వచ్చేలా చేసింది వ్యాక్సిన్.

 జార్ఖండ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బొకొరో జిల్లా ఉతసరా పంచాయతీ పరిధిలో దులార్ చందు ముండా అనే 55 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ క్రమంలోనే వెన్నుముక దెబ్బతినడంతో ఐదేళ్ల నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. కనీసం పక్కకు జరగాలన్న కూడా వేరొకరి సహాయం తీసుకునేవాడు సదరు వ్యక్తి. అంతేకాకుండా మాట కూడా పడిపోవడంతో కేవలం సైగలతో మాత్రమే తాను చెప్పాలనుకున్నది చెబుతూ వస్తున్నాడు. కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి సదరు వ్యక్తి ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఏకంగా మంచానికే పరిమితమైన వ్యక్తి లేచి నిలబడ్డాడు. సైగలతో సరిపెట్టుకున్న వ్యక్తి మాట్లాడటం కూడా మొదలు పెట్టాడు. దీంతో ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించగా ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ముగ్గులు నిపుణులను నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: