జగన్ కు ఉద్యోగ సంఘాల నేతల షాక్.. ?

Veldandi Saikiran
అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం నిన్న జరిగిన సంగతి తెలిసిందే.  అయితే ఈ భేటీలో  ఏపీ జేఎసీ, ఏపీ జేఏసీ  అమరావతి  సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎంవో అధికారులతో గంటన్నర పాటు కొనసాగింది ఉద్యోగ సంఘాల నేతల సమావేశం. అనంతరం మీడియాతో  ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. జగన్ సర్కార్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస రావు,ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్  బొప్పరాజు మాట్లాడుతూ..  7 న 11 పీఆర్సీ పై సీఎం జగన్ ప్రకటన చేశారని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు.  హెచ్ఆర్ఏ, సీసీఎ, పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలపై ఉన్నతాధికారులతో చర్చించాలని అప్పుడు సీఎం సూచించారని తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు.  

హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి పని చేస్తున్న ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.  జిల్లాలు, మున్సిపాల్టీలు, మండలాల్లో పనిచేసే వారికి వేర్వేరు కేటగిరిల్లో హెచ్ఆర్ఎ ఇస్తున్నారని చెప్పారు ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్ కమిటీ సిఫార్సులు   కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లు ఉన్నాయని ప్రకటన చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. సంక్రాంతి పండుగ తర్వాత సీఎంతో మాట్లాడి స్పష్టత ఇస్తాం అన్నారని వెల్లడించారు ఉద్యోగ సంఘాల నేతలు.  అప్పటి వరకు జీవోలను  అభయెన్స్ లో పెడతామని చెప్పారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.  మాతో మరోసారి మాట్లాడి ఆ తర్వాతే జీవోలు విడుదల చేస్తాం అన్నారని వెల్లడించారు ఉద్యోగ సంఘాల నేతలు. మాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకం ఉందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.  సీఎస్ కమిటీ సిఫార్సులనే అమలు చేస్తామంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పనిసరి అవుతుందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.  న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజీపడమని హెచ్చరించారు ఉద్యోగ సంఘాల నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: