రిలీజ్ టుడే : యాండే బంగార్రాజు గోరూ.. అద్దిరిపోయార‌ట మీరు!

RATNA KISHORE
మామూలుగా కాదు ఈ సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన పండ‌గ‌లాంటి సినిమా బంగార్రాజు అదిరిపోయింది.నాగ్ అభిమానులకు ఈ సినిమా క‌న్నుల పండుగే! ముందునుంచి చెబుతున్న విధంగానే నాగ్ లుక్,స్టైల్ అన్నీ అన్నీ ఈ త‌రం కుర్ర హీరో నాగ చైత‌న్య‌తోనే కాదు ఇంకా ఎంద‌రితోనో పోటీ ప‌డేవిధంగానే ఉంది. దీంతో సినిమాకు ఆశించిన విజ‌యం ద‌క్కించుకోవ‌డం త‌థ్యం అనే అనిపిస్తోంది.క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్ చాలా బాగుంది.. హెరాల్డ్ మీడియా మీకు ఈ విష‌య‌మై కొన్ని ప్ర‌త్యేక సంగ‌తులు అందిస్తోంది..చ‌ద‌వండిక..

భ‌లే ఉంది పుంజు మాములుగా లేద‌క్క‌డ!
సోగ్గాడ‌యిన నాగార్జున మ‌రో సోగ్గాడ‌యిన న‌ట వార‌సుడు చైత‌న్యతో ఈ సారి స్క్రీన్ పంచుకున్నారు.గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మాండ‌లికంలో చాలా బాగా సంభాష‌ణ‌లు ప‌లికారు.ఆయ‌న‌కు పోటీగా కొడుకు ఉన్నా కూడా అస‌లు డైలాగ్ డెలివ‌రీ మాస్ ను ఆక‌ట్టుకునే తీరు ఇవ‌న్నీ నాగ్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు అన్నంత మ్యాజిక‌ల్ మానియా ఈ సినిమాతో తీసుకువ‌చ్చారు. ముఖ్యంగా
పాట‌ల్లోనూ అదే స్పీడు కొన‌సాగించారు.త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌యిన నాన్న అక్కినేని త‌ర‌హా పంచెక‌ట్టు క‌ట్టుకుని అంద‌మ‌యిన భామలతో ఈ వ‌య‌స్సులోనూ ఆడిపాడిన తీరు వ‌య‌స్సును ఈయ‌న ఎలా దాచేస్తున్నారు అని డౌట్ రాక త‌ప్ప‌దు. అంత బాగా ఆయ‌న న‌ప్పారు ఈ సినిమాకు సంబంధించి..ముందు నుంచి అంతా అనుకున్న విధంగానే నాగ‌చైత‌న్య పాత్ర  కు మంచి వాల్యూ ఉంది.అయితే న‌ట‌న ప‌రంగా మ‌రికొంత దృష్టి ఉంచాలి. ఆ విష‌యంలో నాన్న నాగార్జున నుంచి కొంత‌యినా ఈ పాత్ర వ‌ర‌కూ నేర్చుకోవ‌చ్చు త‌ను. ఈ సినిమాకు సంబంధించి నాగ్ తీసుకున్న శ్ర‌ద్ధ చాలా బాగుంది అని అంతా అంటున్నారంటే అందుకు కార‌ణం తన‌దైన ప‌ద్ధ‌తి, ఎవ్వ‌రినీ అనుక‌రించ‌ని తీరు, కొద్దిగా నాన్న‌ను పోలిన న‌డక మిన‌హా ఎక్క‌డా ఆయ‌నను అనుక‌రించ కూడ‌ద‌ని  పెట్టుకున్న నియమం ఇవ‌న్నీ నాగ్ కు ప్ర‌త్యేకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: