కాపు వర్సెస్ కాపు: పైచేయి ఎవరిదో?

M N Amaleswara rao
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కులాల వారీగా చూస్తే రాష్ట్రంలో కాపు ఓటర్లే ఎక్కువ. వారే చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములని ప్రభావితం చేస్తారు. అందుకే కాపు వర్గం హవా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాపు నేతలే ఎక్కువ బరిలో దిగుతుంటారు. అయితే కృష్ణా జిల్లాలో కూడా కాపు వర్గం ప్రభావితం చేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు, గుడివాడ, పెడన లాంటి నియోజకవర్గాల్లో కాపులు హవా ఎక్కువ.
అయితే ఆ నియోజకవర్గాల్లో వేరు వేరు వర్గాలు సైతం పోటీ చేస్తూ ఉంటాయి. కానీ ఒక్క అవనిగడ్డలో మాత్రం ఎప్పుడు కాపు నేతలే బరిలో దిగుతారు. ఏ పార్టీలోనైనా సరే కాపు నేతలే పోటీ చేస్తారు. ఇక దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ మండలి, సింహాద్రి ఫ్యామిలీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. 2009 ముందు వరకు సింహాద్రి ఫ్యామిలీ టీడీపీలో పనిచేయగా, మండలి ఫ్యామిలీ కాంగ్రెస్‌లో పనిచేసింది. ఒకోసారి ఒకో ఫ్యామిలీ పైచేయి సాధించేది.
ఇక 2014 ఎన్నికల నుంచి సీన్ మారింది. సింహాద్రి ఫ్యామిలీ వైసీపీ నుంచి, మండలి ఫ్యామిలీ టీడీపీ నుంచి బరిలో దిగుతున్నాయి. 2014లో వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు, టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్‌లు పోటీ చేయగా, మండలిని విజయం వరించింది. అప్పుడు పవన్ , టీడీపీకి సపోర్ట్ చేయడం మండలికి బాగా కలిసొచ్చింది. కాపు ఓట్లు ప్లస్ అయ్యాయి.


2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. జనసేన విడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి మండలి ఓటమి పాలయ్యారు. మొదటిసారి సింహాద్రి రమేష్ విజయం సాధించారు. అయితే ఈ సారి సీన్ మారేలా ఉంది. అది కూడా జనసేన ప్రభావంతోనే...ఒకవేళ జనసేన గాని మళ్ళీ టీడీపీకి మద్ధతు ఇస్తే...వైసీపీ గెలుపు గగనమైపోతుంది. చూడాలి మరి ఈ సారి అవనిగడ్డలో ఏ కాపు నేత పైచేయి సాధిస్తారో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: