మెగా జ‌గ‌న్ : చిత్ర ప‌రిశ్ర‌మ‌కు శుభ‌వార్త చెప్పిన చిరు?

RATNA KISHORE
ఇండ‌స్ట్రీ మేలు కోరి తామేం చేసినా ఆనందిస్తామ‌ని చిరు అంటున్నారు.జ‌గ‌న్ కూడా అందుకు స‌మ్మ‌తిగానే ఉన్నార‌ని స్ప‌ష్టం చేస్తూ ఇవాళ మీడియా ఎదుట ఓ ప్ర‌క‌ట‌న చేశారు.రానున్న కాలంలో చిత్ర సీమ‌కు అనుకూలంగా ఓ శుభ‌వార్త త‌ప్ప‌క వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తూ,చిన్న చిత్రాల‌కు మేలు చేసే నిర్ణ‌యాలే వెలువరిస్తార‌ని మెగాస్టార్ తెలిపారు.
ఉన్నంత‌లో బ‌త‌కాలి ఉన్నంత‌లో బ‌తికించి ప‌దుగురి మంచికీ సాయం చేయాలి.చిన్న చిత్రాల‌కు మెగా స్టార్ పెద్ద సాయం చేశారు. అందుకు జ‌గ‌న్-కు ముందుగా కృత‌జ్ఞ‌త‌లు తెలపాలి.ఆయ‌న చొర‌వ ఫ‌లించి త్వ‌ర‌లోనే చిన్న సినిమాల‌కు మంచి రోజులు రావాల‌ని ఐదో షోకు అవ‌కాశం ఇచ్చే ఆలోచ‌న‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పేం లేదు.
ఎందుకంటే ఇవాళ చిన్న చిత్రాల మ‌నుగ‌డ నానాటికీ క‌ష్ట‌త‌రం అయిపోతున్న త‌రుణాన సంబంధిత సినిమాల రూప‌క‌ర్త‌లు వాటి నిర్మాణానికి,విడుద‌ల‌కు నానా అవస్థ‌లూ ప‌డుతున్నారు.ఈ త‌రుణంలో వారి ఆర్థిక స్థితిని ప‌ట్టించుకునే వారు కూడా పెద్ద నిర్మాత‌ల నుంచి ఎవ్వ‌రూ లేరు.ఇండ‌స్ట్రీలో సినిమా విడుద‌ల‌కు  సంబంధించి కొన్ని నిర్మాణ సంస్థ‌లే ఉండ‌డంతో మిగిలిన‌వ‌న్నీ పెద్ద‌గా పేరున్న‌వి కాక‌పోవ‌డంతో వారే అంతా అయి న‌డిపిస్తున్నార‌న్న అప‌వాదు కూడా ఉంది.దీంతో స‌మ‌స్య ప‌రిష్కారం ఎప్ప‌టిక‌ప్పుడు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న మాదిరిగా ఉండిపోతోంది.ఇలాంటి సంద‌ర్భంలో జ‌గ‌న్ త‌రఫున ప‌న్ను రాయితీలు కూడా అందాయే అనుకోండి అప్పుడు వీళ్ల జీవితాలు మ‌రింత శోభాయ‌మానం కానున్నాయి.

చిన్న చిత్రాల‌కు అండ‌గా ఉండేందుకు వైఎస్ జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు.ఐదో షో వేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నారు.ఇదే మాట ఇవాళ చిరు చెప్పారు. త‌న విన్నపాన్ని విని,ఒప్పుకున్నార‌ని యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్తో భేటీ అనంత‌రం తెలిపారు.అదేవిధంగా చిన్న, పెద్ద సినిమాలు అన్నింటికీ లాభం చేకూర్చేలా, మేలు ద‌క్కేలా మంచి నిర్ణ‌యం ఒక‌టి జీవో రూపంలో వెలువ‌రించ‌నున్నార‌ని కూడా వెల్ల‌డించారు చిరు.మ‌రోవైపు అన్నీ కుదిరితే చిన్న చిత్రాల‌కు రాయితీలు ఇచ్చే విష‌య‌మై కూడా ఏమ‌యినా ఆలోచిస్తే బాగుంటుంద‌న్న ప్ర‌తిపాద‌న ఒక‌టి ఇండ‌స్ట్రీ నుంచి వెళ్ల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: