ఫేక్ సూర్యుడును ఎప్పుడైనా చూశారా?

Satvika
సూర్యుడు అంటే భగ భగ మండే పెద్ద అగ్ని గోళం.. అయితే చంద్రుడు ను కృత్రిమంగా తయారు చేశారు. చల్లగా వెలిగే లైట్ లాగా ఉంటాడు. కానీ సూర్యుడు ను కృత్రిమంగా తయారు చేయడం అనేది చాలా కష్టం. దానిని తాజాగా చైనా సూర్యుడిని తయారు చేసింది. చైనా కృత్రిమ సూర్యుడి ని సిద్ధం చేస్తోందనే సంగతి తెలిసిందే. ఇటీవలే దాన్ని విజయవంతంగా ప్రయోగించారు కూడా. సాధారణ సూర్యుడితో పోల్చితే చైనా ఆర్టిఫిషియల్ సన్ నుంచి విడుదలయ్యే వేడి సుమారు ఐదు రెట్లు ఎక్కువ అని చెప్తున్నారు. ఇది నిజంగానే గ్రేట్ అనే చెప్పాలి.

సాధారణంగా సూర్యుడి కోర్ నుంచి 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చైనా తయారు చేసిన ఈ కృత్రిమ సూర్యుడి నుంచి.. కేవలం 1056 సెకన్ల (17.6 నిమిషాలు) వ్యవధిలో 70 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతోంది. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ పరిశోధకుడు గాంగ్ జియాన్జు స్వయంగా వెల్లడించారు. అయితే, సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. భూమి మీద నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న ఆ అగ్నిగోళమే.. చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు అంటూ ప్రచారం జరుగుతోంది.

కారు మబ్బులను చీల్చుకుంటూ రాత్రివేళ వెలుగులు నింపుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అరుదైన దృశ్యాన్ని వీడియోలు తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదో అద్భతమని కొనియాడుతున్నారు. చైనా కృత్రిమ సూర్యుడిపై ప్రయోగం జరిపిన ఐదు రోజుల్లోనే ఈ వీడియో బయటకు వచ్చింది. దాన్ని చూసిన వారంతా కూడా చైనా తయారు చేసిన సూర్యుడు అని ప్రచారం చేస్తున్నారు.మరి, అది నిజంగా చైనా ప్రయోగించిన కృత్రిమ సూర్యుడేనా? అసలు నిజాన్ని ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి.. ఆ సూర్యుడు ఎలా వచ్చాడో మీరు ఒకసారి  చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: