ఢిల్లీ : ఇప్పుడు నిజంగా రాజనిపించుకున్నారు

Vijaya


మన పురాణాలు, చరిత్ర ప్రకారం క్షత్రియుడు (రాజు) అంటే వీరత్వానికి ప్రతిరూపం. రాజ్యాధికారాన్ని పురాణాలు ఎక్కువగా క్షత్రియులకే అప్పగించింది. కాలక్రమంలో క్షత్రియులే రాజలుగా పాపులరయ్యారు. క్షత్రియులన్నా లేక రాజులన్నా జనాల్లో ఉన్న గుర్తింపు ఏమిటంటే వీరుడు, శూరడని. ఇపుడిదంతా ఎందుకంటే నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు తొందరలోనే రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.




చాలా కాలంగా ఎంపీ రాజీనామా విషయం చక్కర్లు కొడుతునే ఉంది. ఈనెల 7వ తేదీన రాజీనామా చేయబోతున్నారనే వార్త మీడియాలో వస్తునే ఉంది. అయితే ఆయన 7వ తేదీన రాజీనామా చేయలేదు కానీ తొందరలోనే రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఎంతకాలం కావాలో చెప్పాలని కూడా వైసీపీకి సవాలు విసిరారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తొందరలోనే రాజీనామా అన్నది ఫైనల్ అయిపోయింది.




బహుశా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే నరసాపురం పార్లమెంటు ఉపఎన్నిక కూడా జరగచ్చు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత అమరావతి రాజధాని అంశంతోనే ఉపఎన్నికలకు వెళతానని సవాలు విసిరారు. జగన్ ప్రభుత్వాన్ని జనాలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. అంటే ఆయన ఉద్దేశ్యం ప్రకారం తానే మళ్ళీ గెలుస్తానని. ఒకవేళ రఘురాజు ఓడిపోతే పరిస్ధితి ఏమిటి ? ఆ విషయాన్ని చెప్పలేదు.




అంటే రఘురాజు ఓడిపోతే మూడు రాజధానులకే జనాలు మొగ్గు చూపుతున్నట్లు అనుకోవాలేమో. అలాగే రఘురామనే జనాలు చీ కొట్టినట్లు కూడా అనుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఆయన ప్రధాన చాలెంజ్ ఈ రెండు అంశాలే కాబట్టి. మొత్తానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డిని  ఢీ కొట్టేందుకు ఎంపీ సిద్ధపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో రఘురామకు 4,47,594 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన వీవీ శివరామరాజుకు 4,15,685 ఓట్లొచ్చాయి. ఇక జనసేన అభ్యర్ధిగా పోటీచేసిన నాగబాబుకు 2,50,289 ఓట్లు పోలయ్యాయి.




మొదటినుండి రఘురామతో సమస్య ఏమిటంటే తాను అభ్యర్ధి కాబట్టే నరసాపురంలో వైసీపీ గెలిచందంటున్నారు. తాను అభ్యర్ధి కాకపోతే పార్టీ ఓడిపోయేదంటున్నారు. అయితే వైసీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. పార్టీ అభ్యర్ధిగా రఘురామ కాకపోతే ఎంపీ అభ్యర్ధి ఇంకా ఎక్కువ మెజారిటితో గెలిచేవారని వాళ్ళంటున్నారు. అంగ జగన్ గాలిలో కూడా రఘురామ గెలిచింది కేవలం 32 వేల ఓట్ల మెజారిటితోనే.  మొత్తానికి తొందరలోనే మరో రసవత్తరమైన ఉపఎన్నికను ఏపీ చూడబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: