ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ : చేరుతున్నారు.. మ‌రి ప‌ద‌వుల సంగ‌తి..?

Paloji Vinay
తెలంగాణలో త‌మ పార్టీని బ‌ల‌ప‌రుచుకునేందుకు వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానిస్తోంది బీజేపి. తాజాగా తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు విఠ‌ల్, తీన్మార్ మ‌ల్ల‌న్న బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇంకా  చాలామంది చేరుతార‌ని బీజేపీ నాయ‌కులు సంకేతాలిస్తున్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ల‌డం రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. కానీ, బీజేపీ వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానిస్తోంది. అయితే, అంతమందికి బీజేపీ ప‌ద‌వులు ఇవ్వ‌గులుగుతుందా..?  ఆ నేత‌లు బీజేపీలో ఇమ‌డ‌గ‌లుగుతారా అనే చ‌ర్చ మొద‌ల‌యింది. 


నిజానికి బీజేపీలో ఎవ‌రు చేరిన ఆ పార్టీ క‌ల్చ‌ర్‌లోకి మారాల్సిందే త‌ప్పా.. పార్టీ క‌ల‌ర్ మార‌దు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వ‌తంత్య్రం బీజేపీలో ఉండ‌ద‌ని తెలిసిన విష‌యమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో దాదాపు చాలా మంది మంత్రులు ఆ పార్టీ నుంచి వ‌చ్చిన వారే.. ఒక ప‌ది మంది వ‌ర‌కు ఇత‌ర పార్టీలో నుంచి వ‌చ్చి చేరిన వారుంటారు. అలాగే పార్ల‌మెంట్ స‌భ్యుల్లో కూడా అదే ప‌రిస్థితి ఉంది. అయితే, బీజేపీ మొత్తం ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌వాళ్ల‌కే ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది కూడా. కానీ, ఇత‌ర పార్టీల నుంచి కూడా నాయ‌కుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటుంది. వాళ్ల‌కు కూడా ప‌ద‌వులు ఇస్తుంది.


కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జోతిరాధిత్య సింథియాకు ఏకంగా కెబినెట్ లో స్థానం క‌ల్పించారు. అస్సాం బీజేపీ ముఖ్య‌మంత్రి హెమంత్ బిశ్వ శ‌ర్మ కూడా ఇత‌ర పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారే. ఇలా చాలా మంది ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి బీజేపీలో ప‌ద‌వులు అనుభవిస్తున్నారు. అయితే, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారు బీజేపీ సిద్దాంతాల‌కు లోబ‌డి మాత్ర‌మే ప‌ని చేయాల్సి ఉంటుంది. లోప‌ల ఏవిధంగా ఉన్నా స‌రే బ‌య‌ట‌కు మాత్రం పార్టీకి నియ‌మాల‌కు త‌గ్గ‌ట్టుగా క‌నిపించాలి. అయితే, అంద‌రికి వ‌స్తాయా అంటే అది వారిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

   

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: