దేశవ్యతిరేకతను.. రెచ్చగొట్టేందుకు శక్తులు..!

Chandrasekhar Reddy
మావోలు, వీళ్లకు కూడా దేశభక్తి ఉంటుంది. కాకపోతే ఆయా ప్రాంతాలలో జరిగే అన్యాయాలను ఎదిరించలేని వారికోసం పోరాటానికి ముందుంటారు. కానీ వీళ్ళ లో కూడా విలువలు తగ్గిపోతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఆయుధాల కోసం తీవ్రవాదులను ఆశ్రయించడం, మాదకద్రవ్యాలు ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ అవసరాలకు అడ్డుపెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. వీళ్ళ మార్గాన్ని గౌరవించేవారు ఇలాంటి వారికి కూడా ఆర్థికంగా అండగా ఉంటూ ఉంటారు. అయితే అదంతా చట్టబద్దం కాదు కాబట్టి బయటపడినప్పుడు దోషులుగా గుర్తించబడుతూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం మనుషుల మధ్యలో సాధారణ పౌరులుగానే ఉంటూ, ఆయా చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు అనేక చట్టబద్ధ మార్గాలను ఎంచుకుంటున్నారు.
పైకేమో సాధారణ పౌరులు, కానీ తోటివారిలో కలిసిపోయి వారిలో విప్లవ భావాలు రేకెత్తించి, వారిని అటువైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారందరు ఆయా సంఘాలను చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకొని, దానిలో ఆర్థికవేసులుబాటు కోసం అని చెప్పి, ఫండ్స్ రైజ్ చేస్తూ, వాటిని ఇతర చట్టవ్యతిరేక విప్లవ కారులకు అందిస్తూ ఉన్నారు. ఒక దేశంలో ప్రవేశించి, ఆ దేశం యువతను ఆకర్షించి వారిని తమలో చేర్చుకొని, మళ్ళీ మన దేశంపైకే పంపిస్తున్నారు. అది ఒక నష్టం, మరి సంఘాల పేరుతో ఆర్దికపరిపుష్ఠి సాధించుకోవడం ఇంకా పెద్ద నష్టం.
ఉగ్రస్థాయిలో లేదా విలువలు లేని మావోల స్థాయిలో ఇలాంటివి జరిగితే అది దేశానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అనేక రాజకీయ శక్తులు వీళ్లకు అండగా ఉండొచ్చుగాక, కానీ అదంతా నిఘావ్యవస్థ తెలుసుకొని తగిన జాగర్తలు వహించకపోతే, రేపటి రోజున పెద్ద నష్టానికి సిద్దపడాల్సి వస్తుంది. రోజురోజుకు జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో అతిప్రమాదకరమైనవి నివారిస్తూ పోవడం చాలా అవసరం. అలాంటి సంఘాలు ఇవేమి ఉన్నాయో వంటిని గుర్తించి, తగినవిధంగా బుద్ది చెప్పాల్సిన బాధ్యత ఉంది. రేపటి తరాలపై ఈ నిర్లక్ష్యం చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవన్నీ ఆయా ప్రభుత్వాలు నిఘా సంస్థలు గమనించుకుంటూనే ఉండొచ్చుగాక, తగిన జాగర్తలు కూడా తీసుకుంటే మంచిది. సమయం మించిపోయాక నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనాలు ఉండబోవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: