క్రాష్ : బిపిన్ రావత్ మరణంపై సందేహాలు.. విచారణ జరగాల్సిందే?

praveen
నిన్న మధ్యాహ్నం తమిళనాడు లోని నీలగిరి హిల్స్ లో భారత ఆర్మీ కి చెందిన హెలి కాప్టర్ కుప్ప కూలి ఘటన సంచలనం గా మారి పోయింది. ఇక ఈ ప్రమాదం లో ఏకంగా భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణించడం మరింత చర్చనీయాంశం గా మారి పోయింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి సహా మరి  కొంత మంది టాప్ కమాండర్లు కూడా ఇక ఈ ప్రమాదం లో దుర్మరణం పాలయ్యారు. మొత్తం గా హెలికాప్టర్ లో 14 మంది ప్రయాణించగా ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

 కేవలం ఒక్కరు మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.. ఇక తీవ్ర గాయాలు కావడం తో ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. భారత రక్షణ రంగానికి మొట్ట  మొదటి త్రివిధ దళాధిపతి గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మరణం మాత్రం దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతి లో ముంచేసింది. అయితే అత్యాధునిక హెలికాప్టర్ ఎలా కుప్పకూలి  పోయింది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశం  గా మారి పోయింది. ఈ క్రమం లోనే బిపిన్ రావత్ మరణం పై ప్రస్తుతం ఎంతో మంది రాజకీయ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

 ఇటీవలే బిపిన్ రావత్ మరణం  పై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సరికొత్త వాదన వినిపించారు. బిపిన్ రావత్ మరణంపై విచారణ జరిపించాలంటూ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా ఆయన సతీమణి ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు మరణంపై సందేహాలు తలెత్తుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు ఎంపీ సుబ్రమణ్య స్వామి. అందుకే ప్రభుత్వం తప్పకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాంటి బయటి వ్యక్తులతో విచారణ జరిపించాలంటూ సుబ్రహ్మణ్యస్వామి కోరారు. అయితే మరికొంతమంది కూడా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: