లండన్ ను వెనక్కి నెట్టిన ఢిల్లీ.. అంతా కేజ్రీవాల్ వల్లే?

praveen
ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు  నేరాలను అరికట్టేందుకు ఎక్కడికక్కడ నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం పైనే  రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి అని చెప్పాలి. ఇలా ఈ ప్రతి ప్రాంతంలో కూడా వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం నేటి రోజుల్లో కామన్ గా మారిపోయింది.  అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు  సీసీ కెమెరాల కోసమే కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవల సీసీ కెమెరాల విషయంలో ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ సంచలన రికార్డు నమోదు చేసింది. ఏకంగా అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది దేశ రాజధాని ఢిల్లీ.

 గత 7 ఏళ్ళ కాలంలో ఢిల్లీ వ్యాప్తంగా 2 లక్షల 75 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఇక దేశ రాజధాని ఢిల్లీ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించింది. చదరపు కిలోమీటర్ కి 1828 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం.  ఇలా ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా ఢిల్లీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. అయితే చదరపు కిలోమీటర్ కి 1135 సీసీ కెమెరాలతో లండన్ ఢిల్లీ తర్వాత రెండవ స్థానంలో నిలవడం గమనార్హం.. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాలలో సర్వే నిర్వహించి ఇక ఈ రిపోర్టును వెల్లడించగా ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ సంచలన రికార్డును నమోదు చేసింది.

 ఈ సందర్భంగా ఢిల్లీ నగరానికి ప్రపంచ రికార్డు దక్కటం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 140000 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాము అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాన రహదారి తోపాటు కాలనీలు స్కూలు ప్రాంతాలు ఇక ఈ సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది. ఇలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రపంచంలోనే  ఎంతో పాపులారిటీ ఉన్న లండన్ కంటే ఢిల్లీ ముందు స్థానంలో ఉంది అన్నది ఇటీవలే నివేదికలో వెల్లడయ్యింది. ఇలా సీసీ కెమెరాల ద్వారా మహిళల రక్షణ మరింత మెరుగైంది అని కేజ్రీవాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: