హమ్మయ్య... ఢిల్లీ సరిహద్దులు ఖాళీ అవుతున్నాయి


దేశ రాజధాని నగరానికి రోడ్డు మార్గం గూండా రాకపోకలు సాగించే వారు ఇక నుంచి నిరాటంకంగా  వెళ్లి రావచ్చు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరస కార్యక్రమం నిర్వహించారు. పోరాడితే పోయోది ఏమీ లేదు అన్న  లోకోక్తిని ఊతంగా చేసుకుని పోరుబాట పట్టారు. ఎట్ట కేలకు  కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది.
2020 చివరి నుంచి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీని ఒప్పించేందుకు పదివేల మంది రైతులు తమ దీర్ఘకాల నిరసనలను నిర్వహించారు. గత నెలలో ప్రధాన మంత్రి వాటిని వెనక్కి తీసుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచారు.
మోడీ దిగివచ్చినప్పటికీ, రైతులు అన్ని ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై రైతు సంఘాలు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు.
తాజా గా కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని తెలిపింది. ఇందుకోసం క్షేత స్థాయి నుంచి వివిధ దశల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలలో రైతులు కూడా సభ్యులగా ఉంటారని  పేర్కోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు చట్టాలను రద్దు చేసిన విషయాన్ని కూడా ఆ లేఖ లో ప్రభుత్వం పేర్కోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రైతులు తమ దీక్షను వివరించాలని  కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందుకున్న రైతు సంఘాలు, వారి నేతలు దఫాలు దఫాలుగా సమావేశమయ్యారు. లేేఖలో పేర్కోన్న విషయాలను అంశాల వారీగా చర్చించారు.  లేఖలో పేర్కోన్న అంశాలతో ఏకీభవించారు. ఆ తరువాత రైతులు ఒక ప్రకట విడిుదల చేశారు. కోందరు రైతు నాయకులు ఇప్పటి దాకా తమ ఉద్యమానికి మద్దతు నిచ్చిన మీడియా తో మాట్లాడారు.
"మేము ప్రభుత్వం నుండి సవరించిన ప్రతిపాదనను స్వీకరించాము. మేము ప్రతిపాదనను ఆమోదించాము . మాలో  ఏకాభిప్రాయం ఏర్పడింది" అని సంయుక్త కిసాన్ మోర్చా,  యునైటెడ్ ఫార్మర్స్ ఫ్రంట్, రైతు సంఘాల కూటమి ఒక ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది.
రైతు సంఘాల నేతలు గురువారం మరోసారి సమావేశ మయ్యారు. దేశ రాజధాని సరిహద్దులను నుంచి స్వస్థలాలకు వెళ్లి పోవాలని నిర్ణయించారు. దీంతో  ఢిల్లీ సరిహద్దులు దాదాపు ఏడాది కాలం తరువాత ఖాళీ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: