వైసీపీ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. ఆగ‌ని యుద్ధం..!

VUYYURU SUBHASH
ఏపీలో అధికారం వైసీపీలో పలువురు కీలక నేతల మధ్య అంతర్గత యుద్ధాలు తీవ్రమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు పడటంలేదు... కొన్ని జిల్లాల్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పడటం లేదు. రాజమండ్రిలో ఎంపీ మార్గాన్ని భరత్ వర్సెస్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా - గుంటూరు జిల్లాలో విడ‌దల రజిని వర్సెస్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు - అనంతపురం జిల్లాలో ఎంపీ తలారి రంగయ్య వ‌ర్సెస్‌ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోని గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే రజిని వ‌ర్సెస్ ఎంపీ కృష్ణదేవరాయల మధ్య గత ఏడాదిన్నర కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.
గతంలో కోటప్ప కొండ తిరణాళ్లు జరిగిన సమయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కారుపై ఎమ్మెల్యే బంధువులు దాడి చేయడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఇక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను ప్రతి విషయంలోనూ ఎంపీ కృష్ణదేవరాయలు కలుపుకుని వెళుతున్నారు. అయితే ఎమ్మెల్యే రజిని వ‌ర్సెస్ మర్రి రాజశేఖర్ ను ప్రతి విషయంలోనూ పక్కన పెడుతూ వస్తున్నారు.
మ‌ర్రిని ఎంపీ సపోర్ట్ చేయడం కూడా ఎమ్మెల్యే కు రుచించడం లేదని అంటున్నారు. చిలకలూరి పేట మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే విడుదల రజిని భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు లో ఎక్కడా కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫోటో కనిపించలేదు.
దీంతో కార్యక్రమానికి వచ్చిన మంత్రులు కూడా ఈ విషయమే ఆరా తీయడంతో పాటు ఎంపీ కి ఫోన్ చేశారట. అసలు ఎంపీ తనకు ఆహ్వానం లేదని మీరు ఈ కార్యక్రమానికి ఎలా వచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో... ఆ ప్రోగ్రాం ముగిసిన వెంటనే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా మంత్రులు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయమై శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసినట్టు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: