బిపిన్ రావత్ స్థానంలో కొత్తగా ఎవరు రాబోతున్నారంటే?

praveen
ఇటీవలే తమిళనాడులోని ఊటీ దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలినా ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది అన్న విషయం తెలిసిందే. ఇలా హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ ఘటనపై దేశ ప్రజానీకం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఇక హెలికాప్టర్ కుప్పకూలిన ఎన్నో వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

 ఇక మృతదేహాల గుర్తింపు ను డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తున్నారు  ఆర్మీ ఆర్మీ అధికారులు. నీలగిరి జిల్లా కోణార్క్ వెల్లింగ్టన్ లో సైనికాధికారులు శిక్షణ కళాశాల కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఈ ప్రమాదంలో మరణించడం పై ప్రస్తుతం దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. భారత ఆర్మీ లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే జనరల్ బిపిన్ రావత్ మరణంతో తదుపరి సీడీఎస్ అనే దానిపై చర్చ మొదలైంది.

 అయితే ప్రస్తుత విషాదకర సమయాల్లో కూడా భద్రత విషయంలో రాజీ పడకూడదు అనే సూత్రాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోదీ అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహించి తర్వాత సీడీఎస్ ఎవరు అనే విషయం పై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న మనోజ్ ముకుంద నరవనే ను త్రివిధ దళాధిపతి గా నియమించే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో వైస్ సీడీఎస్ గా  కొనసాగుతున్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేరును కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: