బంగారం బాటలోనే.. పరుగులు పెడుతున్న వెండి ధర

N ANJANEYULU
బంగారం బాటలోనే వెండి ప‌య‌ణిస్తోంది. బంగారం మాదిరిగానే వెండి ధర పెరుగుతూ.. త‌గ్గుతూ.. వ‌స్తుండ‌గా.. తాజాగా వెండి భారీగానే పెరిగిన‌ది. కిలో వెండిపై  రూ.700కు పైగా పెరిగిన‌ది.  కోవిడ్ నూత‌న వేరియంట్ అయిన‌ ఒమిక్రాన్  భ‌యానికి  బంగారం, వెండి ధరలపై అధిక ప్రభావం చూపుతుందని.. ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ కారణంగా ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.  తాజాగా గురువారం  వెండి ధర పెరిగిన‌ది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే కావ‌డం విశేషం.  మళ్లీ ధరల్లో మార్పులు  చేర్పులు ఉండే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.
దేశ రాజధాని న‌గ‌ర‌మైన ఢిల్లీలో కిలో వెండి ధర.61,900 ఉంటే..అదే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా రూ.61,900 ఉన్న‌ది. అదేవిధంగా చెన్నైలో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా.. కోల్‌కతాలో రూ.61,900 న‌మోదుగా ఉంది. ఇక బెంగళూరులో కేజీ వెండి రూ.61,900 ఉండగా.. కేరళలో రూ.65,400 ఉన్న‌ది.  తెలంగాణ రాజ‌ధాని న‌గ‌ర‌మైన హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,600 ఉండగా... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని  విజయవాడలో రూ.65,600 వద్ద వెండి ధ‌ర కొనసాగుతున్న‌ది.
ఇంకొక విష‌య‌మేమిటంటే.. ప్ర‌తీ రోజు బంగారం, వెండి ధ‌ర‌ల‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకోవ‌డానికి అంత‌ర్జాతీయంగా ఎన్నో కార‌ణాలు ఉంటాయ‌ని.. ముఖ్యంగా అంత‌ర్జాతీయ మార్కెట్ ధ‌ర‌ల‌లో మార్పు, ద్ర‌వ్యోల్భ‌ణం, కేంద్ర‌బ్యాంక్‌ల వ‌ద్ద ఉన్న బంగారం నిలువ‌లు వాటి వ‌డ్డి రేట్లు, క‌రోనా, జ్యూవెల‌రీ మార్కెట్ త‌దిత‌ర వంటి ప‌లు అంశాల కార‌ణంగా బంగారం, వెండి ధ‌ర‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన ఈ ధ‌ర‌లు బులియ‌న్ వెబ్‌సైట్ ఆధారంగా ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు న‌మోదు అయిన‌వి మాత్ర‌మే.. ఈ ధ‌ర‌ల‌లో కాస్త పెర‌గ‌డం లేదా త‌గ్గే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. ఎందుకైనా మంచిది వెండి కొనుగోలు చేసే ముందు ఒక్క‌సారి ధ‌ర‌ల‌ను ప‌రిశీలించుకుని వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: