మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధర..!

N ANJANEYULU
గత రెండు, మూడు రోజుల నుండి కాస్త  స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర తాజాగా  పెరిగిన‌ది.  రెండు, మూడు రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో స్థిరంగానే  ఉంది ప‌సిడి ధ‌ర‌.  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతొందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.  డిసెంబ‌ర్ 9 గురువారం  రోజు  దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు న‌మోదు అయిన‌వి అని, మళ్లీ ధరల‌లో మార్పులు ఉండే అవకాశం క‌నిపిస్తుంద‌ని..  ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగ‌వ‌చ్చు అనితెలుస్తోంది.  
దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.47,100 ఉండ‌గా.. అదే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.51,30 ఉన్న‌ది. ఇక దేశ ఆర్థిక రాజధాని  ముంబై న‌గ‌రంలో  22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.46,840 , అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840గా కొనసాగుతున్న‌ది.  తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330 వద్ద కొనసాగుతున్న‌ది. అదేవిధంగా  పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800గా న‌మోదై ఉంది.
ఇక  కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వ‌ద్ద కొన‌సాగుతొంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950,  24 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.49,040గా ఉన్న‌ది. ఇక తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.44,950 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.49,040 వద్ద కొన‌సాగుతొంది. అదేవిధంగా ఆంధ‌ప్ర‌దేశ్‌లోని  విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా న‌మోదు అయిన‌ది. ఇక  విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతున్న‌ది.
అయితే ప్రతీ రోజు బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.   అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలలో  మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిలువ‌లు వాటి వడ్డీ రేట్లు, కరోనా, జ్యూవెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉన్న‌దని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.  ఇంకొక‌ విషయం ఏమిటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వ‌బ‌డ్డాయి.  ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున‌.. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి  కొనుగోలు చేయ‌డం బెట‌ర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: