ఎందుకంటే ప్రేమంట! : కన్నడ నాట ప్రభాస్ గాలులు

RATNA KISHORE

వీల‌యితే ప్రేమిద్దాం డ్యూడ్ అని చెప్ప‌డం చిన్న మాట కాదు అలా న‌డ‌వ‌డం, నడుచుకోవ‌డం అన్న‌వి చిన్న ప‌నులూ కావు. ఎం దుకంటే అవ‌న్నీ సాధ్యం కావాలంటే అంద‌రినీ అర్థం చేసుకునే హృద‌యంతో పాటు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండ‌డం కూడా చేయగ‌ల‌గాలి. అప్పుడే మంచి ఫ‌లితాల‌కు ఆస్కారం. స్టార్ హీరో ప్ర‌భాస్ చేసేది ఇదే! ఆయ‌న న‌డ‌వ‌డీ ఇదే! అందుకు తార్కాణాలు ఎన్నో!





మంచి మ‌న‌సున్న మారాజు ప్ర‌భాస్ కు తెలుగులోనే కాదు క‌న్న‌డ నాట కూడా క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఆయ‌న త‌ర‌ఫున ఫ్యాన్ క్ల‌బ్ లు, అసోసియేష‌న్లు పెరిగిపోతున్నాయి. ఒక న‌టుడిగానే కాకుండా విపత్తుల్లోనూ, విల‌యాల్లోనూ తోటివారికి అండ‌గా ఉండ‌డంతోనూ ఆయ‌న మంచి పేరు తెచ్చుకున్నారు. బిహేవియ‌ర్ ప‌రంగా కూడా ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు ఎంతో సమున్న త స్థానం ఉంది. పెద‌నాన్న కృష్ణం రాజు వార‌సుడిగానే ఎంట్రీ ఇచ్చినా అవేవీ ఇప్ప‌టికీ మ‌రిచిపోక, ఆయ‌న చూపిన దారిలోనే న‌డు స్తూ త‌న‌కంటూ ఇమేజ్ సృష్టించుకుని బాహుబ‌లితో ఎంతో పెద్ద న‌టుడిగా ఆవిర్భ‌వించారు. అదొక వ‌న్ ఫిల్మ్ వండ‌ర్.. ఒక్క న‌టు డి జీవితాన్ని ఓ సినిమా ఏ స్థాయిలో ఏ రీతిలో ప్ర‌భావితం చేస్తుందో ఉదాహ‌రణ స‌హితంగా చాటిన సినిమా. ఆ సినిమాతోనే ఆయ నకు వివిధ భాష‌ల్లో అభిమానులు పోగ‌య్యారు. ఆయ‌నంటే ఇష్టం పెంచుకున్నారు. ఆవిధంగా ఆయ‌న ఐదేళ్ల కృషికి ద‌క్కిన ఫ‌లి తం ఇది.



బాహుబ‌లి సినిమాతో అంత‌ర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు వాడ‌వాడ‌లా అభిమానులు ఉన్నారు అనేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా క‌న్న‌డ నాట కూడా ఆయ‌న‌కు ఫ్యాన్స్ అసోసియేష‌న్లు ఉన్నాయి. తాజాగా ఓ ఫ్యాన్స్ అసోసియేష‌న్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియను కూడా పూర్తి చేయించింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ క‌న్న‌డ నాట ఆరంభం కావ‌డంతో ఇటు తెలుగు నాట అభిమానులు కూడా పొంగిపోతున్నారు. తొలి సారి ఒక తెలుగేత‌ర క‌థానాయ‌కుడికి అక్క‌డ ద‌క్కిన గౌర‌వం అని సంబ‌ర‌ప‌డిపోతున్నారు. త‌మ హీరోపై ప్రేమ మ‌రియు అభిమానం చూపిన వారికి వారంతా కృత‌జ్ఞ‌త‌లు చెల్లిస్తున్నారు.



గ‌తంలోనూ ఇలానే తెలుగేత‌రుల‌ను ఆద‌రించిన వారిలో కేర‌ళ అభిమానులు ఉన్నారు.వారంతా అల్లు అర్జున్ ను బాగా ఇష్ట‌ప‌డ తారు. మ‌ల‌యాళీ చిత్ర సీమ‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. అదేవిధంగా క‌న్న‌డ నాట ప్రేమాద‌రాలు అందుకున్న వారిలో మ రో న‌టుడు మంచి న‌టుడు తార‌క్ ఉన్నారు. ఆయ‌న క‌న్న‌డ భాష అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల రు. గ‌తంలో ఓ పాట పాడారు కూడా పునీత్ రాజ్ కుమార్ కోసం! తెలుగేత‌ర ప్రాంతాల‌లో మ‌న నటులు రాణిస్తుండ‌డం ప్యాన్ ఇండియా పేరిట సినిమాలు చేస్తుండ డంతో  మార్కెట్ విస్తృతి పెర‌గ‌డంతో పాటు హీరోలకు ఉన్న క్రేజ్ వివిధ ప్రాంతాల‌కు విస్త‌రణ‌కు నోచుకోవడం శుభ ప‌రిణామ‌మే! ఇక బీటౌన్లో కూడా ప్ర‌భాస్ కు మంచి పేరే ఉంది. ఆయ‌న సినిమాల‌కు మంచి మార్కెట్ అక్క‌డ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆయ‌న రాబోయే చిత్రాల‌న్నింటినీ హిందీ వెర్ష‌న్ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. బ‌హుభాషల‌లో ఓ చిత్రం విడుద‌ల‌వ్వ‌డం ఇది కొత్త కాకున్నా ఓ హీరోకు ఉన్న స్టామినాను పెంచే క్ర‌మంలో ఇటువంటి ప్ర‌య‌త్నాలు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తాయి అని చెప్ప‌డం ఓ వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: