బిపిన్ రావత్ వ్యక్తి కాదు మహాశక్తి..!

NAGARJUNA NAKKA
బిపిన్ రావత్ తన కెరీర్ లో దూకుడుగా వ్యవహరించారు. 1987లో చైనాతో ఘర్షణలు జరిగినప్పుడు బిపిన్ తన టీమ్ తో కలిసి డ్రాగన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. 2015లో NSCNK టెర్రరిస్టులు మయన్మార్ లోకి చొరబడి సరిహద్దు దగ్గర ఉన్న 18మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. విషయం తెలియగానే పారా కమాండోల సాయంతో సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 102మంది ఉగ్రవాదులను ఏరివేశారు బిపిన్. భారత్ ఒక్క  సైనికుడిని కూడా కోల్పోలేదు.
దేశ మొట్టమొదటి సీడీఎస్ బిపిన్ రావత్. భారత త్రివిధ దళాధిపతి అంటే దేశ రక్షణ వ్యవస్థలో చాలా కీలకమైన పదవి. ఆర్మీ, వైమానిక, నౌకాదళాలను సమన్వయం చేయడమే సీడీఎస్ ప్రధాన బాధ్యత. ఈ మూడు దళాల వ్యూహాలు, కార్యాచరణపై కేంద్రానికి సలహాలు ఇవ్వడం, సైనిక వ్యవహారాల్లో నైపుణ్యాలను పెంపొందించడం చేస్తారు. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటైన కమిటీ సీడీఎస్ నియామకాన్ని సిఫార్సు చేసింది. 2019 ఆగస్ట్ 15స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోడీ సీడీఎస్ నియామకాన్ని ప్రకటించారు.
వాయుసేన, ఆర్మీ, నౌకాదళం.. ఈ మూడింటికి చీఫ్ గా త్రివిధ దళాధిపతి  ఉంటారని భారత ప్రభుత్వం 2019లో ప్రకటించింది. తొలి త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీ కాలం 2022 జనవరితో ముగియనుంది. మిలటరీ వ్యవహారాలన్నీ సీడీఎస్ చూసుకుంటారు. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలటరీ అడ్వైజర్ గా వ్యవహరిస్తారు. అంతకుముందు రావత్ మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు.
మంగళవారం బిట్స్ టెక్ దేశాల కార్యక్రమంలో బిపిన్ రావత్ పాల్గొన్నారు. కరోనా కారణంగా ప్రపంచం ప్రమాదంలో పడిందన్నారు. రాబోయే రోజుల్లో బయోవార్ ముప్పు ఉందంటూ బిపిన్ రావత్ హెచ్చరించారు. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ దేశాలకు పిలుపునిచ్చారు. బయో వార్ ముప్పు గురించి హెచ్చరించిన మరుసటి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం పాలవ్వడం షాక్ కు గురి చేస్తోంది.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: