కమలదళంలో మల్లన్న... పోటీ చేసే సీటు అదేనా?

M N Amaleswara rao
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటుంది...గత ఎన్నికల వరకు తెలంగాణలో బీజేపీకి ఒక సీటు గెలుచుకునే సత్తా కూడా లేదనే పరిస్తితి..కానీ దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం...జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం..ఈటల రాజేందర్ లాంటి నాయకుడుని పార్టీలో చేర్చుకుని, హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడంతో రాజకీయం మొత్తం మారిపోయింది. అసలు టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే పరిస్తితి వచ్చింది.
పైగా కేసీఆర్ కూడా బీజేపీనే టార్గెట్ చేయడం బట్టి చూస్తే....బీజేపీనే భవిష్యత్‌లో టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అందుకే పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే ఉద్యమకారుడు విఠల్...బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే తీన్మార్ మల్లన్న సైతం బీజీపీలో చేరిపోయారు.
ఒక యూట్యూబ్ చానల్ పెట్టుకుని మల్లన్న..ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వం తప్పులని ఎండగడుతున్నారో అందరికీ తెలిసిందే. పలు మీడియా చానల్స్‌లో పనిచేస్తూ వచ్చిన మల్లన్న...మొన్నటివరకు ఇండిపెండెంట్‌గానే రాజకీయం చేశారు. అలాగే తనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకుని రాజకీయం నడుపుతూ..కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ వస్తున్నారు. అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి...టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఇక్కడ నుంచే మల్లన్న హైలైట్ అవుతూ వచ్చారు. ఇదే క్రమంలో ఆయన.. ఒక జ్యోతిష్యుడుని బెదిరించారనే కేసులో అరెస్ట్ అయ్యి, బెయిల్ మీద బయటకొచ్చారు. ఇక మలన్న బయటకు రావడానికి బీజేపీ బాగానే సాయపడింది.
అందుకే ఆయన బీజేపీలో చేరిపోయారు. బీజేపీలోకి వెళితేనే టీఆర్ఎస్‌ని ఎదురుకోగలమని మల్లన్న భావించారు...ఇంకా ఆలోచించకుండా ఆ పార్టీలో చేరిపోయారు. మల్లన్న రావడం వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇంకా బీజేపీకి మద్ధతు పెరుగుతుంది. ఇక బీజేపీలోకి వచ్చిన మల్లన్నకు...నెక్స్ట్ ఎన్నికల్లో ఏ సీటు ఇస్తారనే చర్చ కూడా వస్తుంది. బేసిక్‌గా మల్లన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా...ఆ మధ్య హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేదు. మరి ఈ సారి ఎన్నికల్లో బీజేపీ తరుపున బరిలో దిగుతున్నారు..అయితే నల్గొండలోనే ఏదొక నియోజకవర్గంలో ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: