ఆ రెడ్డి ఎమ్మెల్యేలకు సీటు మాత్రం గ్యారెంటీ..!

M N Amaleswara rao
ఏపీలో ఎన్నికలు ఉన్నా లేకున్నా సరే...ఎప్పుడు రాజకీయం హాట్ హాట్‌గానే నడుస్తోంది. ఏదో ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నట్లు రాజకీయ వాతావరణం ఉంటుంది. ప్రతిరోజూ ఏపీలో అదే పరిస్తితి. ఇలా ఏపీ రాజకీయాలు ఉండటానికి కారణాలు లేకపోలేదు. ఎప్పటికప్పుడు పార్టీల టార్గెట్ ఒక్కటే...నెక్స్ట్ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తాయి.
అందుకే ఇప్పటినుంచే రాజకీయాలని హీట్ ఎక్కించేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ-టీడీపీల మధ్య ఎలాంటి రాజకీయ వాతావరణం నడుస్తుందో తెలిసిందే. ఒక పార్టీపై ఒక పార్టీ పైచేయి సాధించాలని చూస్తున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా వెళితే గెలుస్తామని ఇప్పటినుంచే వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో గెలుపు కోసం సొంత నాయకులని సైడ్ చేయడానికైనా టీడీపీ, వైసీపీ అధిష్టానాలు వెనుకాడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలకు గెలుపు గుర్రాలు కావాలి.
అలాంటప్పుడు సరిగ్గా లేని నాయకులని సైడ్ చేయడానికి పార్టీలు ఇబ్బంది పడటం లేదు.  ముఖ్యంగా అధికార వైసీపీ నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే విషయంలో కూడా డౌట్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో తప్పనిసరిగా కొందరికి మాత్రం సీటు ఇచ్చేలా లేదు.
ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే...వైసీపీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. అలాంటివారిని సైడ్ చేయకపోతే వైసీపీ గెలుపుకు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే వైసీపీ అధిష్టానం సైడ్ చేసే వారిలో ఎక్కువగా బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలే ఉండేలా ఉన్నారు.
వారిలో కొందరికి గెలుపు అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. అదే సమయంలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలని మాత్రం పక్కనబెట్టడానికి అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైగా రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నారు. ఈ జిల్లాలు ఎలాగో వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి కాబట్టి...రెడ్డి ఎమ్మెల్యేల సీట్లకు మాత్రం ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: