గుడివాడలో రాధాతోనే రాజకీయం మారుతుందా?

M N Amaleswara rao
ఏపీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరి మీద బాగా ఆగ్రహంతో ఉన్నారంటే...అందరూ జగన్ అనే అనుకుంటారు...కానీ జగన్‌పై రాజకీయ పరమైన ఆగ్రహం ఉంటే...మంత్రి కొడాలి నానిపై టీడీపీ శ్రేణులకు పీకల్లోతు కోపం ఉందనే చెప్పాలి. నానిపై టీడీపీ శ్రేణులకు ఎందుకు కోపం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన..చంద్రబాబుని ఏ రేంజ్‌లో తిడతారో టీడీపీ శ్రేణులకు బాగా తెలుసు. అందుకే నాని అంటే టీడీపీ శ్రేణులు తెగ రగిలిపోతున్నారు.
అయితే ఆయన్ని మాటల పరంగా ఎదురుకోవడం కష్టమని టీడీపీ శ్రేణులకు బాగా అర్ధమైంది. ఎందుకంటే ఇప్పుడు కొడాలి...చంద్రబాబుని తిడతారు...ఇక టీడీపీ శ్రేణులు..ఏమో నానీని తిడతారు. దాని వల్ల నాని ఏమన్నా మళ్ళీ బాబుని తిట్టకుండా ఉంటున్నారా? అంటే అబ్బే అసలు కాదు...ఓ రేంజ్‌లో బాబుతో ఆడేసుకుంటారు. అందుకే ఆయనకు చెక్ పెట్టాలంటే...కేవలం గుడివాడలో నానీని ఓడించడమే ఒక్కటే మార్గమని కార్యకర్తలు భావిస్తున్నారు.
మరి అలా చూసుకుంటే...గుడివాడలో నానీని ఓడించే సత్తా టీడీపీకి ఉందా అంటే అబ్బే అది లేదు. నాని టీడీపీని వీడాక...ఆ పార్టీ తరుపున ఇద్దరు అభ్యర్ధులు వరుసగా రెండు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ నానికి మాత్రం చెక్ పెట్టలేకపోయారు. అసలు భవిష్యత్‌లో కూడా నానికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదని చెప్పొచ్చు. ఎందుకంటే గుడివాడలో నానికంటూ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే...గెలుపు ఆయనదే.
ముఖ్యంగా గుడివాడలో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీల ఓట్లర్లు నాని వైపే మొగ్గుచూపుతున్నారు. అటు కాపులు సైతం నానికే సపోర్ట్. అందుకే నానికి చెక్ పెట్టడం టీడీపీ వల్ల కావడం లేదు...ఆ ఓటర్లని ఆకర్షించే శక్తి గుడివాడలో టీడీపీ నాయకులకు లేదు. అయితే వంగవీటి రాధా గానీ గుడివాడ బరిలో నిలబడితే...కాస్త కాపులు, ఎస్సీ ఓటర్ల సపోర్ట్ పెరుగుతుందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. రాధా ఎంట్రీ ఇస్తే గుడివాడ రాజకీయం మారుతుందని అంటున్నారు. కానీ అనుకున్నంత ఈజీగా నానికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: