బిపిన్ రావత్ సాధారణ పౌరుడు మాత్రం కాదు.


హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత సైనికాధికారి బిపిన్ రావత్ సాధారణ భారత దేశపు పౌరుడు కాదు. అవును ఇది నిజం.  అందరి భారతీయ్యుల లాగా అతను తన భావాలను బహిర్గతం చేయలేడు. ఎందుకో తెలుసా ?
 ఇండియన్ మిలటరీ విభాగాలలో అంటే నావికాదళం, వైమానిక దళం, పదాతి దళం లలో  క్రిందిస్థాయి లో చేరిన సోల్జర్ నుంచి పై స్థాయి లో ఉన్న సర్వసైన్యాధిపతి వరకూ నిబందనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారందరికీ ప్రాథమిక హక్కులపై ఆర్మీ రూల్-19 ప్రకారం చాలా పరిమితులు ఉంటాయి, షరతులు వర్తిస్తాయి. ఇందుకు అనుగుణంగా వారు పని చేయాల్సి ఉంటుంది.
దేశం లోని సాధారణ పౌరులకున్నట్లుగా  భారత్ లోని సోల్జర్స్ కు ఎలాంటి హక్కులు ఉండవు .ఇదేమీ  కోత్త కొత్త గా వెలుగులోకి వచ్చిన విషయం కాదు. సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని సైనికులకు ప్రతిి సంవత్సరం పదే పదే చెబుతూనే ఉంటారు.  సైన్యంలో ఉన్న ఏ భారతీయ్యుడైనా కూడా స్వేచ్ఛగా తన అభిప్రాయలను బహిరంగంగా వెల్లడించడానికి వీలు లేదు. అందువల్ల భారత సైన్యంలో పనిచేసే వారు సాధారణ పౌరులు కారు.
 దివంగత బిపిన్ రావత్ అందరికీ మార్గ దర్శి. ఇదేదో మృతి చెందిన తరువాత చెప్పే పొగడ్త కాదు. స్తోత్కర్ష అసలే కాదు. రావత్ దిశానిర్దేశంలో భారత సైన్యం కొత్త పుంతలుతొక్కింది.  ఆ విషయం మరలా చర్చిద్దాం. రావత్ స్వేచ్చా విహంగం కూడా. నిబంధనలను దాటకుండా తన అభిప్రాయాలను బాహ్య ప్రపంచానికి వెల్లడించిన వ్యక్తి. అందువల్లనే కాబోలు సైనిక స్థావరాల వెలుపల కూడా అతనికి అభిమానులు, ప్రియమైన శత్రువులు కూడా ఉన్నారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా  ఉత్తరాదీన ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో బిపిన్ రావత్ ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గోన్నారు. అక్కడికి విచ్చేసిన విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. తాను చెప్పదల్చుకున్న విషయాలను కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఎట్టి పరిస్థితులలోనూ సైనిక సిబ్బంది ఎవరూ కూడా స్వేచ్చగా మాట్లాడటం ఉండదు. అలా ఎవరైనా, ఎక్కడైనా మాట్లాడ వలసి వస్తే ముందుగా పై అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మిలటరీ రూల్.
రాజకీయ నాయకులకు పేరు రావడం అంటూ జరిగితే వారు చేసిన మంచి పనుల వల్ల మాత్రమే వస్తుంది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే అందరూ రాజకీయ నాయకుల వెంట నడుస్తారు. ప్రజల్ని సరైన దారిలో నడిపించే వారే  సమర్థవంతమైన నాయకులని పించుకుంటారు. వక్ర మార్గంలో నడిచిన వారెవ్వరూ  రాజకీయ నాయకులు కాలేరు అని రావత్ అన్నారు. అంతే కాక విద్యాకుసుమాలు వెల్లి విరియాల్సిన కాలేజీలు, యూనివర్సిటీలలో నిరసనలు జరగడం, అది కాస్తా హింసాత్మకం కావడం మనం చూస్తున్నా. ఇది రాజకీయం అనిపించుకోదు అని రావత్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ కళాశాలలో రావత్ చేసిన ప్రసంగం తో ఆయన విద్యార్థుల దృష్టిలో మార్గదర్శకునిగాను, తన భావాలను వెల్లడించిన స్వేచ్చా విహంగం గానూ నిలిచి పోయారు.
అయితే భారత రాజకీయాలలో వెళ్లూనుకు పోయి ఉన్న రాజకీయ వేత్తలు సహజంగానే బిపిన్ రావత్ ప్రసంగం పై విమర్శల జల్లు కురిపించారు. నాటి రాజకీయాలలో రావత్ ప్రసంగం పై తీవ్ర చర్చే జరిగింది. నిబంధనలను అతిక్రమించి బిపిన్ రావత్ వ్యవహరించారని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ లోని అన్ని రాజకీయ పార్టీ లూ రావత్ వ్యాఖ్యలను ఖండించాయి. బిపిన్ రావత్ మాత్రం రాజకీయ నేతల  విమర్శలను పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: