అమెరికాకు షాకిస్తున్న చైనా..! ఏకంగా..

Paloji Vinay
ప్ర‌పంచంపై ఆధిప‌త్యం చెలాయించాల‌ని అగ్ర‌రాజ్యం అమెరికా, ఇటు డ్రాగ‌న్ కంట్రీ చైనాలు ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 150 దేశాల్లో త‌మ‌ సైనిక స్థావరాలు ఉంచేది. దీని వ‌ల్ల ఒక బ‌ల‌మైన శ‌క్తిగా ఉంటూ వ‌స్తూ ఆధిప‌త్యం చెలాయించింది. ఇప్పుడు ఆ విధానాన్ని త‌గ్గిస్తూ వ‌స్తోంది. దీంట్లో భాగంగానే ప‌లుదేశాల నుంచి త‌మ సైనిక బ‌లాగాల‌ను వెన‌క్కు తీసుకొచ్చుకుంటుంది. ముఖ్యంగా అఫ్ఘ‌నిస్తాన్‌లో త‌మ భ‌ద్ర‌త బలాగాల‌ను ఉప సంహ‌రించుకోవడంతో అమెరికాకు పెద్ద దెబ్బ త‌గిలిన‌ట్ట‌యింది. ఉగ్ర‌వాదంపై పోరును ప‌క్క‌న పెట్టేసింది. అలాగే.. క్యూబా, వియత్నాం విష‌యంలో కూడా అమెరికా విఫ‌లం అయింది.

 ఇలాంటి ప‌రిణామాల‌తో అమెరికా ఆధిప‌త్యం క్ర‌మక్ర‌మంగా ప‌డిపోతోంది. ఈ క్ర‌మంలో గుంట‌కాడ న‌క్క‌ల ఎదురుచూస్తున్న చైనా త‌న అధిప‌త్యాన్ని విస్త‌రించ‌డానికి ప‌న్నాగాలు ప‌న్నుతోంది. ఇప్పుడు చైనా ఏకంగా అమెరికా ప‌క్క‌కే వ‌చ్చి త‌న స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా కాంబోడియా, టాంజానియా అలాగే దుబాయ్ లాంటి ప‌లు చోట్ల త‌న స్థావ‌రాన్ని ఏర్పాటు చేయ‌డాని చైనా సిద్ధం అయింది. ముఖ్యంగా ఆఫ్రికాలో ఉన్న ఎపిటోర‌ల్ గిన్నిలో చైనా స్థావ‌రాన్ని ఏర్పాటు చేస్తోంది. గ‌తంలో ఆ దేశానికి నిధులు ఇచ్చిన చైనా ఇప్పుడు ఆ దేశంలోని కొంత భూ భాగాన్ని తీసుకుంది. అయితే, ఇది అమెరికాకు స‌మీపంలో ఉండడం చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

 ఇప్ప‌టికే ఆఫ్రికాలోని జిబుటీ ద‌గ్గ‌ర సైనిక స్థావ‌రాన్ని ఏర్పాటు చేసిన‌ చైనా.. ఇప్పుడు ఎపిటోరియ‌ల్ గిన్ని, టాంజానియా పెట్టేందుకు సిద్ధం అవుతోంది. మ‌రోవైపు యూఏఈలో స్థావ‌రాన్ని పెట్టేందుకు చూడ‌గా అమెరికా మాట్లాడడంతో చైనాను ఆపింది దుబాయ్‌. కానీ, ఇప్ప‌టికే ఆరు చోట్ల త‌న సైనిక స్థావారాల‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో అమెరికాకు చెక్ పెట్టాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా త‌మ సైనిక స్థావ‌రాల‌ను విస్త‌రించాల‌ని చూస్తోంది. మ‌రోవైపు ఈ ప‌రిస్థితుల‌ను చూస్తున్న అమెరికాకు ఏం చేయాలో తెలియ‌డం లేద‌ట‌.. ఇప్ప‌టికే ఆర్థికంగా అమెరికాను వెన‌కకు నెట్టి ముందు స్తానంలో ఉన్న చైనా.. ఇప్ప‌డు ర‌క్ష‌ణ రంగంలోకి దూసుకు వెళ్తే అమెరికాకు దెబ్బ త‌గ‌ల‌డం ప‌క్కా అంటున్నారు అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: