విశాఖకు.. మెగావీల్ అందాలు..!

Chandrasekhar Reddy
ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకులను ఆకర్షించేందుకు మరో అతిపెద్ద ప్రాజెక్టు కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అదే మెగావీల్, దీనిపై నుండి మొత్తం విశాఖను అలాగే బీచ్ ను చూడటానికి వీలు కలిగేట్టుగా దీనిని రూపుదిద్దనున్నారు. ప్రకృతి అందాలను తిలకించడానికి తగిన విధంగా అంతా గాజుతో నిర్మాణం చెప్పట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకారంగా విశాఖను ఒక రాజధానిగా నిర్ణయించారు కాబట్టి, దానికి మరింత సొగసులు అద్దెందుకు ప్రయత్నిస్తున్నారు. పర్యాటకులను బాగా ఆకర్షించే అవకాశం ఉన్న బీచ్ లాంటి వ్యవస్థ అక్కడ ఉన్నప్పటికీ, విశాఖ ఇప్పటివరకు ఆ స్థాయిలో గుర్తింపు పొందలేదు. దానికోసం ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వం.
ఈ ప్రాజెక్టు లండన్ ఐ తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 15 ఎకరాలు కేటాయిస్తున్నారు. అంచనా వ్యయం 250 కోట్లుగా నిర్ణయించారు. ప్రపంచంలో ఉన్న మెగావీల్ లలో మొదటి పదిలో ఒకటిగా దీనిని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులు 125మీ ఎత్తు నుండి 360డి కోణంలో నగరాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. అయితే భూకంపాలు, వర్షాలు తట్టుకునేలా ఇలాంటి నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఇలాంటి నిర్మాణం చేయాలంటే దానిని బీచ్ రోడ్ లో ఏర్పాటు చేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తుంది.
లండన్ లో థేమ్స్ నది ఒడ్డున 130మీ ఎత్తున ఇలాంటి నిర్మాణము ఏర్పాటు చేయబడింది. దీని ద్వారా ఆ నగరం మొత్తాన్ని చూసే వీలు ఉంటుంది.  అదే తరహాలో విశాఖలో సముద్రం అందాలతో పాటుగా నగరాన్ని కూడా చూడటానికి సౌలబ్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. రాత్రి సమయంలో ఇలాంటి వాటి ద్వారా నగరం, బీచ్ లను చూడటం పట్ల పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు అనే అంచనాకు తగ్గట్టుగా కూడా ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. అంత ఎత్తున భోజనాలు వంటి వాటిని కూడా ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తున్నదట. దీనికి కావాల్సిన భూమి కోసం అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రదేశాలను గుర్తించడం జరిగింది. భిమిలీకి వెళ్తున్న బీచ్ రోడ్డువైపు నిర్మాణం ఉండొచ్చు అనే అంచనా కు కూడా రావడం జరిగింది. ఈ కట్టడంలో 44 క్యాబిన్ లు ఉంటాయి, ఒక్కో క్యాబిన్ లో 10 మంది చొప్పున ఒకేసారి 440 మంది ప్రయాణించే వీలు కల్పిస్తున్నారు. వీటిలో పాటుగా అనేక షాపింగ్ కాంప్లెక్స్ లు, పార్కింగ్, ఇతర రిక్రియేషన్ ఏర్పాట్లు కూడా ఉండనున్నాయి. ప్రతి క్యాబిన్ గ్లాస్ తోనే  చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. క్యాబిన్ ద్వారా 125మీ పైకి వెళ్లిన వారికి లాండింగ్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా గ్లాస్ తో ఏర్పటు చేస్తున్నారు. దానితో కింద కూడా చూసే వీలు కల్పిస్తున్నారు. ఆర్థిక విషయాలకు వస్తే, ఇదంతా రాష్ట్రప్రభుత్వం మాత్రమే చేపట్టనుందా లేక ప్రైవేట్ భాగస్వామ్యం ఉండనుందా అనేది పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: