లోకేష్ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు...?

Gullapally Rajesh
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాదాపుగా రెండు నెలల నుంచి సైలెంట్ గా ఉండటం పట్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులలో కార్యకర్తలలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి 2019 తర్వాత నారా లోకేష్ అన్ని విధాలుగా ప్రయత్నం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రజల్లోకి దూకుడుగా వెళ్లే కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆయన వల్ల ఇబ్బంది పడినా సరే వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టి ఏకతాటి మీదకు తీసుకు రావడానికి ఆయన కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు.
అయితే నారా లోకేష్ ప్రసంగాలకు పెద్దగా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో కూడా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పెద్దగా చర్చ జరగక పోవడం అనేది తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకుడు నారా లోకేష్ దూకుడుగా ఉండటంతో  సంతోషంగా ఉన్నా సరే రెండు నెలల నుంచి అని ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటి అనేది అర్థం కాక కాస్త ఇబ్బంది పడుతున్నారు.
చంద్రబాబు నాయుడు సతీమణి తన తల్లి భువనేశ్వరి లక్ష్యంగా వైసిపి నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా కన్నీరుపెట్టిన సరే నారా లోకేష్ నుంచి ఘాటైన స్పందన రాకపోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ఇటీవల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నమే ఎక్కువగా చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు కానీ నారా లోకేష్ మాత్రం మాట్లాడకపోవడం వరద బాధిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేయకపోవడం వంటివి కాస్త ఇబ్బంది గా కూడా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: