చైనాలో.. సామాన్యుల డేటాకు రెక్కలు..!

Chandrasekhar Reddy
చైనా విగర్ ముస్లిం లను అదుపు చేయడం కోసం వాళ్లపై అనేక ఆంక్షలు పెడుతుంది. అసలు ఆ దేశంలో నోరెత్తి మాట్లాడే హక్కు ఎవరికీ లేదనేది తెలిసిన మాటే. అలాగే ఎవరికీ ఎటువంటి హక్కులు ఉండబోవు, చెప్పింది బానిసల్లాగా చేసుకుంటూ పోవడమే అక్కడ వారికి ఉన్న ఒకే ఒక పని. అదే హక్కు, అదే స్వేచ్ఛ అక్కడ. ఆ స్థాయిని మించేవిధంగా అక్కడ ప్రభుత్వం విగర్ ముస్లిం ల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వాళ్ళను నిత్యం సీసీ కెమెరాల తో పర్యవేక్షిస్తుంది. వాళ్ళు ఎక్కడకు వెళ్లాల్సి వచ్చినా ఫేస్ రికగ్నిషన్ చేయాల్సిందే అనే నియమం పెట్టింది. కనీసం సినిమాకు వెళ్లినా వాళ్ళు ఎవరితో వెళ్లారు, ఏమేమి చేశారు లాంటి స్వవిషయాలు కూడా పూర్తిగా తెలుసుకునేట్టుగా ప్రస్తుత పర్యవేక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.
విగర్ లు ఉన్న ప్రాంతంలో కాలు తీసి కాలు వేసినా కూడా వారిపై నిఘా ఏర్పాట్లు గతంలో చేసింది. అయితే ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ ద్వారా (ఫేస్ రికగ్నిషన్) అందరికి అమలు చేస్తుంది. బహుశా దానికి భయం పట్టుకుని ఉండొచ్చు, ఎవరైనా తనదేశంలోకి గూఢచర్యం లేదా, మరొకటి చేయవచ్చనేది. అందుకే ప్రతిచోటా ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేసింది. పోలీసులకు కూడా కళ్ళజోడు రూపంలో బయట సంచరించే వారి వివరాలు తెలుసుకునే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది చైనా. సహజంగా అది నేర చరిత్ర ఉన్న వారిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం అందరికి ఉపయోగించే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అంటే ఇక ఏ చైనా వారైనా ఎక్కడకు వెళ్లినప్పటికీ ఆయా సమాచారం అంతా ప్రభుత్వానికి చేరిపోతుంది. మనవద్ద చిన్న ఆధార్ సమాచారం అడిగితే ఎంతో యాగీ చేస్తాం, కానీ ఇక చైనా పౌరులకు కనీస సమాచారం దాచుకునే హక్కు కూడా పోయిందనట్టే. జిన్ పింగ్ కు ప్రజలలో చాలా వ్యతిరేకత ఉన్నట్టే ఉంది, అందుకే సమాచారం ఎలాగైనా ప్రపంచానికి చేరిపోతుందని, పౌరులు చేసే ప్రతి పని పై నిఘా పెట్టేశారు. గొప్ప అధ్యక్షుడండి బాబు. ఇప్పటికే తన ప్రభుత్వంపై నోరు పారేసుకున్న వారిని కనిపించకుండా చేస్తున్నాడు కాబట్టి, ఇకమీదట ఏ పౌరుడు నోరు మెదపరు కాబోలు. వాళ్లకు స్వేచ్ఛ దొరకాలని ప్రపంచం ప్రార్థనలు చేయాల్సిన సందర్భం! సో శాడ్!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: