భ‌ద్రాచ‌లంలో మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు..!

N ANJANEYULU
భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా  పోస్టర్లు అంటించ‌డంతో స్థానికంగా కలకలం రేపుతుంది.  ముఖ్యంగా ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే ఇలాంటి పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. తాజాగా  మావోయిస్టులకు వ్యతిరేకంగా  పోస్టర్లు వెలువ‌డ‌టం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్టుగా పట్టణంలో అక్కడక్కడా పోస్టర్లనూ అంటించారు. అదేవిధంగా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలే వేసిన‌ట్టు  ఈ పోస్టర్లలో సారాంశం ఉంది.
నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా ..? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా..?  లేక  ప్రజా విప్లవము అంటే విధ్వంసమా? తుపాకీ గొట్టం ద్వారా 50 ఏళ్ల‌లో సాధించింది ఏమిటి? అదివాసులారా… మీ మద్దతు విధ్వంసానికా…!  లేక అభివృద్దికా…! పీఎల్‌జీఏ వారోత్సవాలు అంటే ప్రజలను పీడించడమేనా అని.. ఇంటికి 50 రూపాయలతో పాటు  కిలో బియ్యం బలవంతంగా సేకరించడమేనా వారోత్సవాలు అంటే? అని  పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. అదేవిధంగా ఆటోకు 500 రూపాయలు, ట్రాక్టర్ కు 500 రూపాయలు పన్ను విధించి బలవంతంగా వసూలు చేయడమేనా వారోత్సవాలంటే..? అమాయక ప్రజలను పార్టీలో చేరమని ప్రోత్సహిస్తూ వారి జీవితాలను నాశనం చేయడమేనా వారోత్సవాలు అంటే? అంటూ మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తున్న విధంగా ఉన్న‌ది.
ముఖ్యంగా న‌క్స‌లిజం వ‌ద్దు- అభివృద్ధి ముద్దు అనే టైటిల్‌తో మ‌రొక పోస్ట‌ర్ వెలిసింది. ఇందులో ముఖ్యంగా విప్ల‌వోద్య‌మంలో చేర‌మ‌ని రెచ్చ‌గొట్టే వారి పిల్ల‌లు విదేశాలలో ఉన్నార‌ని.. మ‌న పిల్ల‌ల‌ను అడ‌విలోకి పంపుతున్నారు. ప్ర‌భుత్వం చేప‌ట్టే వివిధ ప‌థ‌కాల‌ను నక్స‌లైట్ల‌ను త‌రిమికొడ‌దాం.. ఆదివాసుల బిడ్డ‌ల చేత తుపాకులు ప‌ట్టిస్తున్న వారిని ఏరి పారేద్దాం అని వెల్ల‌డించారు. విప్ల‌వమంటే రోడ్ల‌ను ధ్వంసం చేయ‌డ‌మేనా..? అని ప్ర‌శ్నిద్దాం. దండ‌కార‌ణ్యంలో ఉంటున్న ప్ర‌జలు చేసిన పాప‌మేమిటి..? ఇంకా వాళ్లు రాతియుగంలోనే బ్ర‌త‌కాలా..? ఆదివాసి బిడ్డ‌ల‌కు విష‌పు సిద్ధాంతాల‌ను నేర్పిస్తున్న న‌క్స‌లైట్‌ల‌ను అడ్డుకుందాం అని.. ప్ర‌పంచ‌మంతా టెక్రాల‌జి దిశ‌గా మారుతున్న‌ది. మ‌రీ ఆదివాసీల త‌ల‌రాత‌లు మారేదెప్పుడు.. ఒక్క‌సారి ఆలోచించి అభివృద్ధి బాట‌లో ప‌య‌నించి.. ముందు త‌రాల‌కు వెలుగును ఇవ్వండి అని వెలిసిన పోస్ట‌ర్లు సంల‌చ‌ల‌నం సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: