ఏపీలో పరీక్షల హడావిడి.. విద్యాశాఖ బిజీబిజీ..!

NAGARJUNA NAKKA
డిసెంబర్ 17 నుంచి ఫార్మేటివ్-2 పరీక్షలను పాఠశాల విద్యార్థులకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో కలిపి 73లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఉండనుంది. మూల్యాంకనం కూడా అదే పాఠశాల టీచర్లు చేయనుండగా.. మూల్యాంకనం సరిగ్గా జరిగిందో లేదో తెలుసుకునేందుకు ఎమ్ఈఓ స్థాయిలో తనిఖీలు జరగనున్నాయి. మార్కులను విద్యాశాఖ వెబ్ సైట్ లో నమోదు చేస్తారు.
ఫార్మేటివ్-2 పరీక్షలకు రెసిడెన్షియల్, మున్సిపల్ ఆదర్శ, కేజీబీవీ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఫీజులు చెల్లించాలి. ఈ ఏడాది నుంచి అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రశ్నాపత్రాలు ముద్రించి, సరఫరా చేసేందుకు ఈ ఫీజు వసూలు చేస్తున్నారు. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులు 110రూపాయలు, 9, 10 తరగతుల విద్యార్థులు 140రూపాయలు, గ్రామాల్లోని 1 నుండి 5తరగతుల వారు 70రూపాయలు, మున్సిపాలిటీ పరిధిలోని వారు 60రూపాయల చొప్పున చెల్లించాలి.
మరోవైపు ఇంటర్ విద్యార్థులకు అర్ధ సంవత్సరం పరీక్షలను డిసెంబర్ 13నుంచి నిర్వహించనున్నారు. డిసెంబర్ 22వరకు జరిగే ఈ పరీక్షలను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న 10లక్షల మంది రాయనున్నారు. ఈ అర్ధ సంవత్సరం పరీక్షల మార్కులను జ్ఞాన భూమి పోర్టల్, ఇంటర్మీడియట్ వెబ్ సైట్లలోనూ అప్ లోడ్ చేయాలని విద్యామండలి ఆదేశించింది. అలాగే ఇంటర్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.
విద్యార్థులారా..! ఈ పరీక్షలను అంత తేలిగ్గా తీసుకోకండి. కరోనాతో గతంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దైన సమయంలో ఇంటర్నల్ మార్కులను ప్రామాణికంగా తీసుకున్నారు. విద్యార్థులకు గ్రేడ్ లు కేటాయించారు. కాబట్టి పాఠాలల స్థాయిలో జరిగే ఫార్మెటివ్ పరీక్షలు, ఇంటర్ కు జరిగే అర్ధ సంవత్సరం పరీక్షలకు బాగా సిద్ధం అవ్వాలి. మంచి మార్కులు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండియా హెరాల్డ్ స్టూడెంట్స్ కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: