ఎన్నిక‌ల స్టంట్ : యోగి గిఫ్టుల పంపిణీ..!

Paloji Vinay
ఎన్నిక‌ల స‌మ‌యంలో గిఫ్టులు ఇచ్చే సంప్ర‌దాయం రోజురోజుకు పెరిగిపోతోంది. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల సంద‌ర్భంలో జాకెట్ ముక్క‌లు, కుంకుమ భ‌ర‌ణెలు గిఫ్టులు ఇచ్చారు కానీ అవి పెద్ద‌గా ప్ర‌భావితం చూప‌లేదు. త‌రువాత రూ.50 తో ప్రారంభ‌మైన ఈ గిఫ్ట్ క‌ల్చ‌ర్‌ ఇప్పుడు రెండు నుంచి ప‌దివేల రూపాయ‌లకు దాటిపోయింది. ఇది కొన్ని ప్రాంతాల్లో అవ‌స‌రాలు, సంద‌ర్భాల‌ను బ‌ట్టి ఓట్లప్పుడు ఈ ఖ‌ర్చు మారుతుంటుంది. అయితే, ఇప్పుడు ఈ గిఫ్ట్ క‌ల్చ‌ర్ తాజాగా నార్త్ ఇండియాకు పాకింది. ఈ ద‌క్షిణ భార‌త‌దేశంలో ఎక్కువ‌గా ప్రాచుర్యం పొందిన ఈ క‌ల్చర్ ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ నార్త్ ఇండియాకు తీసుకువెళ్లాడు.

   ఇటీవ‌ల కేజ్రీవాల్ త‌మ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి వ‌స్తే ఆ రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఆడ‌పిల్ల‌కు వెయ్యి రూపాయ‌లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాబోయే ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్య‌నాథ్ గుడ్ న్యూస్ అంటూ.. డిసెంబ‌ర్ రెండో వారంలో ప్ర‌భుత్వం త‌రఫున ఉచితంగా మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు అందించ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. యువ‌త కోసం డిజి శ‌క్తి అనే పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసి దీని ద్వారా యువ‌త‌కు మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు ఇవ్వ‌బోతున్నామ‌ని వెల్ల‌డించారు.


  అదే వెబ్‌ పోర్ట‌ల్ లో విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు ఎలా పొందాలి.. దీంతో పాటు భ‌విష్య‌త్తు అధ్య‌య‌నాల‌కు సంబంధించిన కంటెంట్‌ను పెడుతామ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అదే కాకుండా స్మార్ట్ ఫోన్‌లు, టార్గెట్‌ల గురించి విద్యార్థుల‌కు వారి మొబైల్ ఫోన్‌ల‌కు, ఈ -మెయిల్స్ ద్వారా రోజు తెలియజేసే కార్య‌క్ర‌మాన్ని తీసుకురాబోతున్నారు. అయితే,  తాము అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలోని యువ‌త‌కు ట్యాబ్‌లు ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో గిఫ్ట్ క‌ల్చర్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ఈ నిర్ణ‌యాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: