ముగిసిన మాజీ సీఎం రోశ‌య్య అంత్య‌క్రియ‌లు

N ANJANEYULU
మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ గ‌వ‌ర్న‌ర్ పార్థివ దేహాన్ని  రోశ‌య్య నివాసం నుంచి ఉద‌యం 11.15 గంట‌ల‌కు బ‌య‌లు దేరి దాదాపు 11.50 గంట‌ల వ‌ర‌కు  గాంధీభ‌వ‌న్‌కు తీసుకువ‌చ్చారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి,   జ‌గ్గారెడ్డి ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు గాంధీభ‌వ‌న్‌లో  రోశ‌య్య‌కు నివాళుల‌ర్పించారు. ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ దూత‌గా వ‌చ్చిన రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే రోశ‌య్య భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు రోశ‌య్య పార్థివ దేహం వ‌ద్ద గాంధీ భ‌వ‌న్‌లో పూల‌మాల‌లు ఉంటి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.  
 అనంత‌రం నిర్వ‌హించిన అంతిమ‌యాత్ర‌లో నాయ‌కులంద‌రూ పాల్గొన్నారు. తూంకుంట పుర‌పాల‌క సంఘం ప‌రిధిలోని దేవ‌ర‌యాంజ‌ల్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రం వ‌ద్ద‌కు ఇవాళ మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు రోశ‌య్య భౌతిక‌కాయాన్ని  తీసుకొచ్చారు.  ముఖ్యంగా వీహెచ్ ఇవాళ ఉద‌యం నుంచి అంత్య‌క్రియ‌లు చేసే స్థ‌లం వ‌ద్దే అన్ని ఏర్పాట్ల‌ను చూసుకున్నారు. చివ‌రిసారిగా నివాళుల‌ర్పించేందుకు ప‌లువురు నేత‌లు, సినీ ప్ర‌ముఖులు ఫామ్‌హౌస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అంత్య‌క్రియ‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌రుపున మంత్రి వెల్లంప‌ల్లి  శ్రీ‌నివాస్‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, జ‌గ్గారెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు క‌డ‌సారి చూపు కోసం అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు.
 రోశ‌య్య పార్థివ దేహాన్ని ఫాంహౌస్ వ‌ద్ద‌కు తీసుకొచ్చిన ఓ గంట సేప‌టి  సాంప్ర‌దాయ‌ ప్ర‌కారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు అన్ని నిర్వ‌హించి.. ఆ త‌రువాత అత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  రోశ‌య్య  కుమారుడు త‌ల‌కొరివి పెట్టారు. అనంత‌రం అధికార‌  లాంఛ‌నాల‌తో అధికారికంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. మాజీ ముఖ్య‌మంత్రి, గ‌వ‌ర్న‌ర్‌ రోశ‌య్య, అజాత శ‌త్రువు అమ‌ర్ హై అనే నినాదాలు అంత్య‌క్రియ‌ల వ‌ద్ద మారు మ్రోగాయి. అంత్య‌క్రియల వ‌ద్ద‌కు కాంగ్రెస్ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర పార్టీల రాజ‌కీయ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి రోశ‌య్య అంత్య‌క్రియ‌ల‌ను తిల‌కించారు. ముఖ్యంగా అన్ని పార్టీల నాయ‌కులు రోశ‌య్య సేవ‌ల‌ను గుర్తు తెచ్చుకున్నారు. కుటుంబ స‌భ్యులంద‌రూ చివ‌రి సారిగా రోశ‌య్య‌కు నివాళుల‌ర్పించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: