నారా లోకేష్ మెచ్చిన ' ఆకుమ‌ర్తి రామారావు ' ...!

VUYYURU SUBHASH
ఆకుమ‌ర్తి రామారావు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌. పార్టీ అంటే పిచ్చి అభిమానం.. పార్టీ కోసం ప‌దేళ్లుగా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉంటే ఆయ‌న త‌ట్టుకోలేరు. త‌న‌వంతుగా త‌క్ష‌ణ‌మే స్పందించి సాయం చేయాల్సిందే..! ప‌దేళ్ల క్రింద‌టే ఆకుమ‌ర్తి రామారావు పార్టీ యువ‌నేత నారా లోకేష్ పేరిట నారా లోకేష్ సేవా స‌మితి ఏర్పాటు చేసి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు.

పార్టీ కార్య‌క్ర‌మాలు మాత్ర‌మే కాకుండా కార్య‌క‌ర్త‌ల కోసం వ్య‌క్తిగ‌తంగా ల‌క్ష‌లాది రూపాయలు ఇస్తూ ఉంటారు. పార్టీ 2014లో అధికారంలోకి రావ‌డానికి ముందే ఆయ‌న ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ప్పుడు కూడా కేడ‌ర్‌కు సాయం చేస్తూ రావ‌డంతో పాటు చింత‌ల‌పూడిలో పార్టీని బ‌తికించ‌డంలో త‌న వంతుగా కృషి చేశారు. గ‌త ఎన్నికల‌కు ముందు చింత‌ల‌పూడి సీటు ఆశించారు. టిక్కెట్ ద‌క్క‌పోయినా కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌గా మ‌రింత క‌సితో ప‌ని చేస్తున్నారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు నాడు వైసీపీ లో ఓ కీల‌క నేత త‌మ పార్టీలోకి వ‌స్తే సీటు ఇవ్వ‌డంతో పాటు ఖ‌ర్చంతా తామే భ‌రిస్తామ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చినా కూడా ఆయ‌న మాత్రం బ‌తికినంత వ‌ర‌కు టీడీపీలో ఉంటానే త‌ప్పా కండువా మార్చ‌న‌ని తెగేసి చెప్పారు. ఇదే పార్టీ ప‌ట్ల ఆయ‌న అంకిత భావానికి నిద‌ర్శ‌నం.

వివాద ర‌హితుడు.. స్థానికుడు :
చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో జ‌రిగే ప్ర‌తి పార్టీ కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న త‌న వంతుగా ముందు ఉంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్రమాల‌కు పార్టీ పిలుపు ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం ఆయ‌న ముందుండి పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఆకుమ‌ర్తిది ముందు నుంచి వివాదాల‌కు దూరంగా ఉండే మ‌న‌స్త‌త్వం. పార్టీలో పెద్ద‌, చిన్న నాయ‌కుల‌తో పాటు అన్ని సామాజిక వ‌ర్గాల్లోనూ ఆయ‌న‌కు ప‌ట్టుంది. అంద‌రిని స‌మ‌న్వ‌యం చేసుకునే స‌త్తా ఉంది. పైగా స్థానికుడు కావ‌డం కూడా రామారావుకు క‌లిసి రానుంది.
శ‌భాష్ అన్న లోకేష్‌.. మ‌రోసారి పిలుపు ప‌క్కా...ఆకుమ‌ర్తి రామారావు తాజాగా హైద‌రాబాద్‌లో యువ‌నేత నారా లోకేష్‌ను క‌లిశారు. ప‌దేళ్లుగా ఆయ‌న లోకేష్ పేరుతో చేస్తోన్న సేవా కార్య‌క్ర‌మాల గురించి లోకేష్‌కు ఇంత‌కు ముందే తెలుసు. తాజాగా మ‌రోసారి ఆయ‌న తాను నారా లోకేష్ సేవా స‌మితి పేరుతో చేస్తోన్న కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను ఆయ‌న‌కు వివ‌రించ‌గా.. వాటిని స‌వివ‌రంగా చూసిన లోకేష్ రామారావును ప్ర‌త్యేకంగా అభినందించారు. అలాగే త్వ‌ర‌లోనే మీకు స‌మాచారం ఉంటుంద‌ని.. మీరు పార్టీ కార్యాల‌యంలో క‌ల‌వాల‌ని కూడా సూచించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆకుమ‌ర్తికి లోకేష్ పిలుపు ఎందుకోస‌మా ? అన్న చ‌ర్చ అయితే స్థానిక పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: