వైసీపీలో ఇంటి పోరు: ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే చెక్..?

VUYYURU SUBHASH
అధికారం అనే ముసుగు ఉండటం వల్ల వైసీపీలో ఉన్న లొసుగులు బయటపడటం లేదు గానీ...కనిపించకుండా ఆ పార్టీలో కూడా లుకలుకలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. ఆ ఆధిపత్య పోరు ఇప్పటికిప్పుడు పార్టీకి డ్యామేజ్ చేయకపోయినా...రానున్న రోజుల్లో మాత్రం నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల దర్శి మున్సిపాలిటీలో వైసీపీ ఓడిపోవడానికి కూడా కారణం ఆదిపత్య పోరే.

అలా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తుంది. అలాగే కర్నూలు సిటీలో కూడా నాయకుల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు అసలు పొసగడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా సిటీ సీటుని దక్కించుకోవాలని ఎస్వీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్వీకు సీటు దక్కకుండా...మళ్ళీ తానే సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

అయ్యే ఎస్వీతో పోలిస్తే హఫీజ్‌ రాజకీయంగా చాలా జూనియర్. పైగా 2014లో ఎస్వీ వైసీపీలో తరుపున కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మధ్యలో టీడీపీలోకి వెళ్లారు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. కానీ జగన్ మాత్రం సీటు ఇవ్వలేదు..ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన హఫీజ్‌కు సీటు ఇచ్చారు. ఇక జగన్ గాలిలో హఫీజ్ ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఎమ్మెల్యేగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళుతున్నారు.

కానీ ఇటు ఎస్వీ కూడా నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారు. తన వర్గంతో...నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు చూస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం చూస్తున్నారు. అయితే ఎస్వీ రెడ్డి వర్గం నాయకుడు కాబట్టి..నెక్స్ట్ తన వర్గం నేతల సపోర్ట్‌తో సీటు దక్కించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ జగన్...హఫీజ్‌కే ఫిక్స్ అయితే ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా తేడా జరిగితే హఫీజ్‌ సీటు గోవిందా. అని ఇప్పుడు స్థానికం గానే పార్టీ లో చ‌ర్చ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: