పాక్, చైనా మధ్య.. కారిడార్ మద్యం చిచ్చు..!

Chandrasekhar Reddy
అతిపెద్ద ఎకనామిక్ కారిడార్ అని పాక్ ప్రచారం చేసుకున్నంత సేపు పట్టలేదు, దాని బాగోతం. ఇప్పుడు అదే పాక్ కు అతిపెద్ద సమస్య అయి కూర్చుంది. ముఖ్యంగా ఇమ్రాన్ కు ఇదే చివరి ఎన్నికలు అన్నంతగా అతడిపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోతుంది. ముందుగా ఆర్థికసాయం పేరుతో చైనా ఈ కారిడార్ ను పాక్ లో, అదికూడా అసలు అక్కడ పెద్దగా వ్యాపారం సాధ్యపడదని తెలిసి కూడా, ప్రారంభించింది. అందుకు పెద్ద సంఖ్యలో చైనీయులు కారిడార్ పనుల పేరుతో పాక్ లో చేరారు. వారికి మద్యం అవసరం అనే పేరుతో ముందుగా ఎకనామిక్ కారిడార్ లో చైనా తన మద్యం ఉత్పత్తిని, అమ్మకాలను ప్రారంభించింది. దానితో ఆట మొదలైంది.
పాక్, చైనా వాసుల జీవన శైలి కానీ సంప్రదాయాలు కానీ చాలా బిన్నంగా ఉంటాయి, దానితో పాక్ వచ్చిన చైనీయులతో వాళ్ళు ఇమడలేకపోయారు. అలాగే పాక్ లో మద్యం అమ్మకాలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తో ఆయా ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. అందుకు చైనా కూడా దరఖాస్తు చేసుకొని, అనుమతి పొంది, ముందుగా కారిడార్ లో భారీగా బీర్, వైన్ ఉత్పత్తి ప్రారంభించింది. అంటే పాక్ లో నీళ్లకంటే, మద్యం ఏరులై పారడం ప్రారంభం అయ్యింది. ఇదంతా సహించలేని పాకిస్తానీయులు నిరసనలు మొదలు పెట్టారు. ఏకంగా ఎకనామిక్ కారిడార్ కు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరగటం ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పటికే 19 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ దెబ్బతో అక్కడ ఉన్న కొద్దిపాటి వ్యాపార కార్యకలాపాలు కూడా స్తంభించాయి. అవన్నీ మూసేవరకు ఆందోళన కారులు ఊరుకోలేదు. అందుకే ఇమ్రాన్ వాటిని మూసివేయించారు. అయినా అసలు ఆ కారిడార్ అవసరం లేదనే ఉద్దేశ్యం కావచ్చు, మొదటి నుండి వారికి చైనా అంటే పడక పోవడం వలన కావచ్చు ఇంకా నిరసన కారులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా పాక్-చైనా వ్యవహారంపై గట్టి దెబ్బ కొట్టేట్టుగానే ఉన్నాయి. వచ్చే ఏడాది ఇమ్రాన్ కు ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదురుకోవాల్సిన అవసరం కూడా ఉంది, అందుకే అటు ప్రజలను ఏమి అనలేక, ఇటు చైనా కు ఎదురు చెప్పలేక నలిగిపోతున్నాడు. అయితే ఈ వ్యతిరేకతను అడ్డుపెట్టుకొని తాలిబన్ లు కావచ్చు, చైనా కావచ్చు తమకు  ఈసారి పాక్ ప్రధానిగా చేసుకోవాలని చూస్తున్నారు. చూడాలి ఇమ్రాన్ వ్యూహాత్మకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నాడు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: